Tirupati ruia: తిరుపతి రుయా పిల్లల ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ పాజిటివ్ వార్డ్.. ఆందోళన కలిగిస్తున్న చిన్నారుల్లో కరోనా..

ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లలు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలో 29మంది చిన్నారులు కోవిడ్ బారిన పడ్డారు. అంతా పదేళ్లలోపు పిల్లలే...

Tirupati ruia: తిరుపతి రుయా పిల్లల ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ పాజిటివ్ వార్డ్.. ఆందోళన కలిగిస్తున్న చిన్నారుల్లో కరోనా..
Tirupati Ruia Childrens Hos

Updated on: Jun 07, 2021 | 6:34 PM

ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లలు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలో 29మంది చిన్నారులు కోవిడ్ బారిన పడ్డారు. అంతా పదేళ్లలోపు పిల్లలే కావడం భయాందోళనకు గురి చేస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో చిన్నారులు ఆసుపత్రి పాలవుతుండటం తల్లిదండ్రుల్లో ఆందోళన నింపింది.

కరోనా సోకిన పదేళ్లలోపు చిన్నారులు తొమ్మిది మంది తిరుపతి రుయా పరిధిలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. వీరిలో కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన చిన్నారులను రూయా ఆస్పత్రిలో చేర్పించారు. వీరంతా శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రంలోపు చేరిన వారే.

వీరిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు రుయా అధికారులు తెలిపారు. రెండు రోజుల వ్యవధిలో ఇంతమంది పిల్లలు ఆస్పత్రిలో చేరడం రాష్ట్రంలో ఇదే తొలిసారని అధికారులు అంటున్నారు. గడిచిన 15 రోజుల్లో మరో 20 మంది చిన్నారులూ చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయినట్లుగా తెలుస్తోంది.

ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతి రుయాకు తరలించారు. ఇటీవల వీరి తల్లిదండ్రులకు పాజిటివ్‌ రావడంతో వారి నుంచి పిల్లలకు సోకి ఉంటుందని డాక్టర్లు భావిస్తున్నారు. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో తిరుపతి రుయాలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో చిన్నారులతో వారి తల్లినిఅనుమతి ఇస్తున్నారు. జర్మన్ హ్యాంగర్ విధానంలో నూతన హాస్పిటల్ ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి: Detox Drink: ప్రతి ఉదయం డిటాక్స్ డ్రింక్ తాగండి.. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోండి..

సర్వేపల్లితోనే ఆనందయ్య మందు ఆగిపోదు.. త్వరలోనే ఇతర జిల్లాలకూ పంపిణీ చేస్తాం – ఎమ్మెల్యే కాకాణి

Loading...
Unable to load recommendations.
Follow Us