గుడ్‌న్యూస్.! నైరుతి.. ఈసారి ముందుగానే.. తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. వానలే వానలు..

|

May 15, 2024 | 8:00 AM

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశానికి కూడా చల్లని కబురు ఇది. మరో నాలుగైదు రోజుల్లో మేఘ సందేశం రానుంది. ఎండ వేడితో, ఉక్కపోతతో ఉస్సూరుమంటున్న ప్రజలకు హుషారు తెప్పించే వార్త ఇది. గత ఏడాదిలా కాకుండా ఈసారి తెలుగు రాష్ట్రాలను గట్టిగా పలకరిస్తామంటున్నాయి నైరుతి రుతుపవనాలు..

గుడ్‌న్యూస్.! నైరుతి.. ఈసారి ముందుగానే.. తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. వానలే వానలు..
Southwest Monsoon
Follow us on

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశానికి కూడా చల్లని కబురు ఇది. మరో నాలుగైదు రోజుల్లో మేఘ సందేశం రానుంది. ఎండ వేడితో, ఉక్కపోతతో ఉస్సూరుమంటున్న ప్రజలకు హుషారు తెప్పించే వార్త ఇది. గత ఏడాదిలా కాకుండా ఈసారి తెలుగు రాష్ట్రాలను గట్టిగా పలకరిస్తామంటున్నాయి నైరుతి రుతుపవనాలు. విపరీతమైన ఎండలు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది ముందుగానే నైరుతి పలకరిస్తుందంటోంది. ఈనెల 19వ తేదీన అండమాన్ నికోబార్ దీవులను నైరుతి రుతు పవనాలు తాకుతాయి.

ఆ తర్వాత కేరళను పలకరించి.. తెలుగు రాష్ట్రాలకు చల్లని మబ్బులు దూసుకొస్తాయి. గత ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయిన నేపథ్యంలో.. ఈసారి రుతు పవనాలు ఎలా ఉండబోతున్నాయి? వర్షాలు సమృద్ధిగా పడతాయా? సాధారణంగా ఉంటాయా? ఇప్పుడు ఇదే ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈసారి వర్షపాతం బాగా నమోదవుతుందని చెబుతోంది వాతావరణ శాఖ. ఎల్‌ నినో ప్రభావం తగ్గి, లా నినో ప్రభావం రాబోతుండడం దీనికి దోహదం చేస్తుందంటున్నారు అధికారులు.

ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని, వర్షాలు కురిసేందుకు అనువైన వాతావరణం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ ఏడాది ప్రస్తుతానికి అనుకూల పరిస్థితులే ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తొలకరి పలకరింపు కోసం తెలుగు రాష్ట్రాలు తెగ ఎదురు చూస్తున్నాయి.