Celebrities in BJP: బీజేపీలోకి మరో ఇద్దరు టాలీవుడ్ సీనియర్ నటీమణులు?.. తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా?..

Celebrities in BJP: బీజేపీకి గ్లామర్ డోస్ పెరుగుతోంది. సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను..

Celebrities in BJP: బీజేపీలోకి మరో ఇద్దరు టాలీవుడ్ సీనియర్ నటీమణులు?.. తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా?..

Updated on: Jan 05, 2021 | 8:26 AM

Celebrities in BJP: బీజేపీకి గ్లామర్ డోస్ పెరుగుతోంది. సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను బీజేపీ ఆకర్షిస్తోంది. ఆ క్రమంలో పలువురు సెలబ్రిటీలను కూడా పార్టీలోకి చేర్చుకుంటోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హీరోయిన్ మాధవీలత గతంలోనే బీజేపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న తమిళనాడుకు చెందిన ఖుష్బూ సైతం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక దక్షిణాదిలో బలం పెంచుకోవడానికి తహ తహలాడుతున్న బీజేపీ పెద్దలు.. సినీ ప్రముఖులను తమ పార్టీలోకి లాగేందుకు యత్నిస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా ఏపీ బీజేపీ నాయకుడు సత్యమూర్తి సీనియర్ నటీమణులు వాణీ విశ్వనాథ్, ప్రియారామన్‌లను చెన్నైలో వేర్వేరుగా కలిశారు. వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయ భవిష్యత్‌పై వారికి పూర్తి భరోసాను ఇచ్చారు. ఆ సందర్భంగా వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే త్వరలో తిరుపతి లోక్‌సభ స్థానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రచారానికి రావాల్సిందిగా సత్యమూర్తి వారిని కోరారట. దానికి వారు కూడా అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, మరికొద్దిరోజుల్లో ఈ ఇద్దరు నటీమణులు అధికారికంగా బీజేపీ కండువా కప్పుకోనున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

 

Also read:

Brian Lara:టెస్ట్‌ మ్యాచ్‌లో తొలి డబుల్ సెంచరీ.. ఆ స్టేడియం పేరునే కూతురి పేరుగా పెట్టిన బ్రియాన్ లారా..

Alexa In telugu: ఇకపై తెలుగులో మాట్లాడనున్న ‘అలెక్సా’… ఐఐటీ హైదారాబాద్‌ అభివృద్ధి..