Konaseema: తల్లిదండ్రులు గుర్రాల బండిపై ఊరేగింపు.. రుణం తీర్చుకున్న తనయుడు

| Edited By: Surya Kala

Nov 14, 2024 | 6:14 PM

సహస్ర చంద్ర దర్శనం చేసిన కన్న తల్లి తండ్రుల రుణం తీర్చున్నారు తనయులు. వృద్ధప్యపు వయసులో ఉన్న తన తల్లిదండ్రులను గుర్రపు బండిపై ఊరంతా ఊరేగించాడు. అనంతరం తల్లిదండ్రులకు పాద పూజ చేసి.. పుష్పభిషేకం చేసి తమని కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల రుణం తీర్చుకున్నారు కుమారులు..

Konaseema: తల్లిదండ్రులు గుర్రాల బండిపై ఊరేగింపు.. రుణం తీర్చుకున్న తనయుడు
Sahasra Chandra Darshan
Follow us on

కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా వయసు మళ్ళిన తల్లిదండ్రులను ఇంటి లో నుంచి వెళ్లగొట్టే తనయులు కొందరు.. అనాథ ఆశ్రమాల్లో విడిచిపెడుతున్న తనయులున్న ఈ రోజుల్లో .. సహస్ర చంద్ర దర్శనం చేసిన తమ తల్లిదండ్రులను ఘనంగా సత్కరించి రుణం తీర్చున్నారు తనయులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి అరవగరువులో కన్న తల్లిదండ్రులను గ్రామస్తులు, బంధు మిత్రులు, అభిమానుల సమక్షలో ఘనంగా సత్కరించుకున్నారు కుమారులు. తల్లిదండ్రులకు సహస్ర చంద్ర దర్శన మహోత్సవం వైభవంగా నిర్వహించారు.

Sahasra Chandra Darshanam 1

తాత సుబ్బారావు, అన్నపూర్ణల కుమారుడు విశ్వనాథ్, కోడలు ఉమా రామలక్ష్మి , కుమార్తె బాలత్రిపుర సుందరి, అల్లుడు సూర్యనారాయణలు.. సుబ్బారావు, అన్నపూర్ణలకు ఎంతో వైభవంగా సహస్ర చంద్ర దర్శన మహోత్సవం, పుష్పాభిషేకం నిర్వహించారు. తల్లిదండ్రులను బంధుమిత్రులు, ఊరూ జనంతో కలిసి గుర్రపు బండిపై ఊరేగించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల అందరి సమక్షంలో వివిధ రకాల పూలతో పాద పూజ నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

ఇది చూసిన జనం వయసు మళ్ళిన తల్లిదండ్రులను కనీసం ఇంట్లో కూడా వుంచకుండా అనాథ ఆశ్రమాల్లో వదిలిపెడుతున్న ఈ రోజుల్లో వృద్ధాప్య వయసులో అత్యంత అంగరంగ వైభవంగా సన్మానించుకోవడం ఆ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అని అంటున్నారు. ఇలాంటి కుమారులు దొరకడం వారి అదృష్టం అంటూ అభినందించారు. ఇలాంటివి చూసి అయినా తల్లిదండ్రులకు తిండి కూడా పెట్టకుండా ఇంట్లో నుంచి గెంటేసి రోడ్లపై వదిలేస్తున్న కొడుకులు, కూతుర్లు మారాలి అంటున్నారు నెటిజన్లు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..