Konaseema Floods: వరద పోయి.. బురద మిగిలింది.. వరదబాధితులను భయపెడుతున్న పాములు, తేళ్లు

|

Jul 21, 2022 | 11:54 AM

కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలం పాశర్లపూడి పల్లిపాలెంలో వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే విష సర్పాలు..  ఇళ్లల్లోకి చేరి  హడలెత్తిస్తున్నాయి. 

Konaseema Floods: వరద పోయి.. బురద మిగిలింది.. వరదబాధితులను భయపెడుతున్న పాములు, తేళ్లు
Konaseema Floods
Follow us on

Konaseema Floods: గోదావరి నదిలో (Godavari River) ఇన్ ఫ్లో తగ్గడంతో.. శాంతించింది. దీంతో నది పరివాహక గ్రామాల్లో వరద తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ ఇంకా అనేక గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. ఓ వైపు వరద ముంపుతో (Flood Effect) ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు వరద నీరు తగ్గుతూ బురద మిలింది. ఈ నేపథ్యంలో విష సర్పాలు హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా కోనసీమ జిల్లాలోని(Konaseema District) వరద బాధిత లంక గ్రామాల్లో విష సర్పాలు.. ఇళ్లల్లోకి చేరుకుంటున్నాయి. తాజాగా జిల్లాలోని మామిడికుదురు మండలం పాశర్లపూడి పల్లిపాలెంలో వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే విష సర్పాలు..  ఇళ్లల్లోకి చేరి  హడలెత్తిస్తున్నాయి.  ఓ మహిళ వంట చేద్దామని వంట ఇంట్లోకి వెళ్ళింది. అయితే ఆమెకు గ్యాస్ స్టౌవ్ దగ్గర నుంచి  బుసలు కొడుతున్న చప్పుడు వినిపించడంతో భయంతో ఇంటి నుంచి బయటకు పరుగు తీసింది. వెంటనే ఈ విషయాన్నీ స్థానిక స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించారు.

వెంటనే వర్మ రంగంలోకి దిగి.. వంట ఇంట్లోకి తాచుపాముని బయటకు తీసుకుని వచ్చి.. చాకచక్యంతో పాముని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి ఎక్కించాడు. అనంతరం.. ఆ పాముని..నిర్మానుష ప్రదేశంలో వదిలేశాడు.

మరోవైపు మామిడికుదురు మండలంలో ఓ వ్యక్తిని పాము కాటు వేసిన ఘటన చోటు చేసుకుంది. తెల్లవారు జామున నిద్ర మేల్కొన్న సత్యనారాయణ అనే వ్యక్తి.. మంచం నుంచి కిందకు దిగడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతని కాలి పై విష సర్పం కాటు వేసింది.  వెంటనే వైద్య సిబ్బంది అతడికి ప్రాధమిక చికిత్స అందించి.. మెరుగైన చికిత్స నిమిత్తం.. రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..