Viral News: పండ్ల దుకాణంలోని రిఫ్రిజిరేటర్‌లోంచి బుసలు కొడుతున్న శబ్ధాలు.. తీరా డోర్‌ ఓపెన్‌ చేయగానే…

భయాందోళనకు గురైన కస్టమర్లు, షాపు యజమాని భయంతో బయట పరుగులు తీశాడు. ఈ లోగో చూసేసరికి అక్కడే ఉన్న కూలడ్రింక్స్‌ నిల్వచేసే రిఫ్రిజిరేటర్ లోకి దూరిపోయింది ఆ పాము.

Viral News: పండ్ల దుకాణంలోని రిఫ్రిజిరేటర్‌లోంచి బుసలు కొడుతున్న శబ్ధాలు.. తీరా డోర్‌ ఓపెన్‌ చేయగానే...
Snake Hides In Fridge F

Updated on: Sep 16, 2022 | 11:40 AM

Viral News: పాములంటే చాలా మందికి హడల్‌.. దాన్ని చూడగానే భయంతో పరుగులు తీస్తారు. కొంతమంది పాము కనబడితే చాలు.. దాన్ని చంపేవరకు నిద్రపోరు. అయితే, వర్షాకాలంలో పాములు తరచూగా కనబడుతూనే ఉంటాయి. ముఖ్యంగా గ్రామాల్లో పొలంలోనో, ఇంటి ఆరు బయటో పాములు తిరుగుతూనే ఉంటుంటాయి. కానీ, ఫ్రిజ్‌లో ఉన్న పండ్లు కూరగాయలు తీసుకునేందుకు డోర్‌ తీయగానే.. ఫ్రిజ్‌లో నుంచి బుసలు కొడుతున్న తాచుపాము ప్రత్యక్షమవ్వడంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు.. ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించినా అది దొరక్కపోవడంతో అందరూ భయంతో హడలిపోయారు. స్థానికంగా ఉండే స్నేక్ క్యాచర్ ఈ పామును పట్టి సంచిలో బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే…

విశాఖలోని తూర్పు నావికాదళం నవశక్తివిహార్‌లోని ఓ పండ్ల దుకాణంలో పాము ఉండడాన్ని దుకాణదారుడు గమనించాడు. భయాందోళనకు గురైన కస్టమర్లు, షాపు యజమాని భయంతో బయట పరుగులు తీశాడు. ఈ లోగో చూసేసరికి అక్కడే ఉన్న కూలడ్రింక్స్‌ నిల్వచేసే రిఫ్రిజిరేటర్ లోకి దూరిపోయింది ఆ పాము. దీంతో పాములు పట్టే నేర్పారైన స్నేక్‌ క్యాచర్‌ కిరణ్ కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన కిరణ్.. రిఫ్రిజిరేటర్ అడుగుభాగం లో ఉన్న పామును అత్యంత చాకచక్యంగా పట్టుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి