Watch Video: ఔరా, నీలం రంగులో పాము పడగ.. ఆ చిన్ని కృష్ణుడి పాదాల అచ్చులివేనేమో..!

| Edited By: Jyothi Gadda

Feb 01, 2024 | 5:53 PM

కొందరు పాములను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. వాటితో కలిసి తింటారు. కలిసి పడుకుంటారు. కలిసి ఆడుకుంటారు.. అలాంటి పాముల్లో చాలా రకాలు ఉన్నాయి. ఎక్కువగా మనకు ముదురు గోదుమ రంగు లేదా ఎరుపు, నలుపు, తెలుపు, పచ్చ రంగుల్లో పాములను చూస్తుంటాం. కానీ, ఈ పాము గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంది.. పడగ విప్పినప్పుడు దాని రంగు నీలం రంగులో మెరిసిపోతోంది. ఈ వింత పాము అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కనిపించి హల్‌చల్‌ చేసింది.

Watch Video:  ఔరా, నీలం రంగులో పాము పడగ.. ఆ చిన్ని కృష్ణుడి పాదాల అచ్చులివేనేమో..!
Snake In Blue Colour
Follow us on

పాము..ఈ పేరు వింటే చాలా మందికి హడల్‌.. అల్లంత దూరంలో పాము ఉందంటే.. ప్రాణభయంతో పరుగులు తీస్తారు చాలా మంది. కానీ, కొందరు పాములను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. వాటితో కలిసి తింటారు. కలిసి పడుకుంటారు. కలిసి ఆడుకుంటారు.. అలాంటి పాముల్లో చాలా రకాలు ఉన్నాయి. ఎక్కువగా మనకు ముదురు గోదుమ రంగు లేదా ఎరుపు, నలుపు, తెలుపు, పచ్చ రంగుల్లో పాములను చూస్తుంటాం. కానీ, ఈ పాము గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంది.. పడగ విప్పినప్పుడు దాని రంగు నీలం రంగులో మెరిసిపోతోంది. ఈ వింత పాము అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కనిపించి హల్‌చల్‌ చేసింది.

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురు హై స్కూల్ గ్రౌండ్ లో అరడుగుల త్రాచు పాము హల్చల్ చేసింది. మొదట పామును చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అరడుగుల పొడవుతో కనిపించిన పాముకు దూరంగా పారిపోయిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ దుర్గారావు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న దుర్గారావు క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పామును చూశాక అది దాహంతో ఉందని గ్రహించి అతను దానికి గ్లాస్‌తో మంచినీళ్లు తాగించాడు..అనంతరం నిర్మానుష ప్రదేశంలో వదిలేశారు. అయితే, నీళ్లు తాగుతున్న ఆ పాము పడగ వింతగా కనిపించింది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా పాము పడగ అరుదైన రంగులో మెరుస్తూ కనిపించింది. పాము పడగ విప్పినప్పుడు కృష్ణుడి పాదాల కింద ఉండే నీలపు రంగులో ఈ పాము తలతల కింద మెరుస్తుంది.

ఇవి కూడా చదవండి

పాము పడగ విప్పినప్పుడు నీలపు రంగులో తలతల మెరుస్తుండటం చూసి స్థానికులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటువంటి త్రాచుపామును ఎప్పుడూ చూడలేదంటూ గ్రామస్తులు పామును చూసేందుకు క్యూ కట్టారు.

స్నేక్ క్యాచర్ దుర్గారావు మీ చుట్టుపక్కల మీ ఇళ్లలోకి పాములు చేరినప్పుడు నాకు సమాచారం ఇవ్వాలని సూచించాడు. ఇందుకోసం ఎటువంటి డబ్బులు ఆశించని పాముని ఫ్రీగానే పట్టుకుని నిర్మానుష ప్రదేశంలో వదిలి వేస్తానని చెప్పాడు. దయచేసి ఎవరు విశేషాసర్పాలను చంపకూడదని దుర్గారావు కోరుతున్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..