శ్రీశైలం ఆలయం ప్రాంగణంలో భారీగా ఉన్న ఎనిమిది అడుగుల త్రాచు పాము కొంతసేపు భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. కార్తీకమాసం పౌర్ణమి గడియలు దగ్గర పడటంతో భారీ పొడవుగల పాము ఆలయ ప్రాంగణంలో ప్రత్యక్షం అయింది. మల్లన్న స్వామివారి గర్భాలయ ఎదురుగా ఉన్న ఉమా రామలింగేశ్వరస్వామి మండంపలో నిత్యం భక్తులు తిరిగే ప్రదేశంలో రేపు కార్తీక పౌర్ణమి గడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నాగు పాము భక్తుల కంట పడింది.
తాచు పామును చూసిన భక్తులు స్వయాన దేవతలను చూసినట్లు భక్తి పరవశంలో భక్తులు.. ఆశ్చర్యానికి లోనయ్యారు. అలర్టైన ఆలయ సిబ్బంది స్నేక్ క్యాచర్ రాజాకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్నేక్ క్యాచ్చర్ పామును చాకచక్యంగా పట్టుకుని సమీపంలోని అడవుల్లో క్షేమంగా విడిచిపెట్టారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆలయ గర్భాలయం సమీపంలో పౌర్ణమి గడియలు సమీస్తున్న సమయంలో పాము భక్తులకు కనపడటం భక్తులు భక్తి భావంతో దర్శించుకోవడం ఆనందానికి గురయ్యారు. అయితే ఇంత పెద్ద దేవాలయానికి అత్యవసర పరిస్థితుల్లో పాములను పట్టుకునేందుకు దేవస్థానం తరుపున స్నేక్ క్యాచర్ లేకపోవడం విశేషం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..