Andhra Pradesh: ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వెళ్ళిన వ్యక్తికి షాక్.. ఏసీకి సేదదీరుతున్న పాము..

అనంతపురం జిల్లా గుంతకల్ కు వెళ్ళాల్సిందే.. పండగొచ్చింది కదా పైసలు డ్రా చేద్దామనుకున్న వ్యక్తికి ఏటిఎంలో పైసలకు బదులు ఏటీఎం మెషిన్ వెనుక నుంచి పాము బయటకు వచ్చింది. కార్డు పెట్టి కావాల్సిన అంత పైసలు తీసుకుందాం అనుకుంటే పాము వచ్చేసరికి ఖంగుతిన్నాడు ఆ వ్యక్తి. పామును చూడగానే హడలిపోయి బయటికి పరుగు తీసాడు.

Andhra Pradesh: ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వెళ్ళిన వ్యక్తికి షాక్.. ఏసీకి సేదదీరుతున్న పాము..
Snake In Atm

Edited By:

Updated on: Oct 16, 2023 | 9:47 AM

ఇకపై ఏటీఎం సెంటర్లలోకి వెళ్లేటప్పుడు జర ముందు.. వెనక చూసుకుని వెళ్లాల్సిందే.. ఎందుకంటే పొలంలోనే.. ఇంటి ఆవరణలో కనిపించే పాములు ఇప్పుడు ఏటీఎం సెంటర్స్ లో కూడా దర్శనం ఇచ్చే అవకాశం ఉంది. ఇది నిజం.. ఎందుకంటే.. అనంతపురం జిల్లా గుంతకల్లులో తాచుపాము కలకలం సృష్టించింది.  ఏటీఎం సెంటర్లో దూరిన పామును చూసి వినియోగదారులు హడలిపోయారు.

అనంతపురం జిల్లా గుంతకల్ కు వెళ్ళాల్సిందే.. పండగొచ్చింది కదా పైసలు డ్రా చేద్దామనుకున్న వ్యక్తికి ఏటిఎంలో పైసలకు బదులు ఏటీఎం మెషిన్ వెనుక నుంచి పాము బయటకు వచ్చింది. కార్డు పెట్టి కావాల్సిన అంత పైసలు తీసుకుందాం అనుకుంటే పాము వచ్చేసరికి ఖంగుతిన్నాడు ఆ వ్యక్తి. పామును చూడగానే హడలిపోయి బయటికి పరుగు తీసాడు.

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ఎటిఎం సెంటర్లో పాము వినియోగదారులను పరుగులు పెట్టించింది. బయట వాతావరణం వేడిగా ఉంది ఏటీఎం సెంటర్ ఏసీలో కాస్త సేదతీరుదామనుకుందో?  ఏమోగానీ? పాము అందులో దూరింది. పాము ఏటీఎంలో ఉన్న విషయం తెలుసుకున్న జనం గుమిగూడారు. పక్కనే ఉన్న హోటల్లోని ఒక వ్యక్తి  ధైర్యం చేసి ఎటిఎం సెంటర్లో దూరిన పామును కర్ర సాయంతో బయటకు తీసుకురావడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..