AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: దొంగ తెలివి తేటలు.. ఫోన్లు కొట్టేసేందుకు ఏం చేస్తున్నారో చూడండి..

నగరంలోని వసంత రాయ పురానికి చెందిన ప్రసాద్ ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 26 వ తేదిన అమరావతి రోడ్డులో ఉండగా ఒక యువకుడు బైక్ పడిపోతున్నట్లు సాయం చేయాలని అడిగాడు. దీంతో ప్రసాద్ వెంటనే ఆ యువకుడికి సాయం చేయడానికి వెళ్లాడు. అదే సమయంలో మరొక యువకుడు కూడా వచ్చి బైక్ పై నుంచి పడిపోతున్న యువకుడికి ప్రసాద్ తో పాటు సాయం అందించాడు. ఆ తర్వాత ప్రసాద్...

Viral: దొంగ తెలివి తేటలు.. ఫోన్లు కొట్టేసేందుకు ఏం చేస్తున్నారో చూడండి..
Cheft video
T Nagaraju
| Edited By: Narender Vaitla|

Updated on: Nov 26, 2023 | 12:38 PM

Share

గుంటూరులో కొత్త తరహాలో సెల్ ఫోన్ చోరులు రెచ్చిపోతున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక చోట ఒకే తరహాలో సెల్ ఫోన్లు చోరికి గురవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్లున్న ఫోన్లు రావడం వాటి ధర కూడా ఇరవై వేల రూపాయల నుండి నలభై వేల రూపాయల ధర పలుకుతుండటంతో దొంగలు సెల్ ఫోన్ చోరీలపై ద్రుష్టి పెట్టారు. సిసి కెమెరా విజువల్స్ పరిశీలిస్తే ఈ నయా చోరుల గుట్టు తెలిసిపోయింది.

నగరంలోని వసంత రాయ పురానికి చెందిన ప్రసాద్ ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 26 వ తేదిన అమరావతి రోడ్డులో ఉండగా ఒక యువకుడు బైక్ పడిపోతున్నట్లు సాయం చేయాలని అడిగాడు. దీంతో ప్రసాద్ వెంటనే ఆ యువకుడికి సాయం చేయడానికి వెళ్లాడు. అదే సమయంలో మరొక యువకుడు కూడా వచ్చి బైక్ పై నుంచి పడిపోతున్న యువకుడికి ప్రసాద్ తో పాటు సాయం అందించాడు. ఆ తర్వాత ప్రసాద్ తన పని నిమిత్తి అక్కడే ఉన్న షాపులోకి వెళ్లాడు. ఇదే సమయంలో అదే బైక్ పై వాళ్లిద్దరూ వెళ్లిపోయారు. అయితే షాపులోకి వెళ్లిన తర్వాత ప్రసాద్ తన జేబులో సెల్ ఫోన్ పోయినట్లు గుర్తించాడు. వెంటనే బయటకు వచ్చి చూసినా ఆ యువకులు కనిపించలేదు. ఆ ఇద్దరూ యువకులే సెల్ ఫోన్ కొట్టేసినట్లు ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడే ఉన్న సిసి కెమెరా విజువల్స్ కూడా తీసుకున్నాడు. ఇదంతా సిసి కెమెరా విజువల్స్ లో స్పష్టంగా రికార్డైంది.

అదే సంఘటన మరోసారి..

ఇంతవరకూ అంతా మామూలు కథే.. అయితే ఇది జరిగిన రెండు నెలల తర్వాత ప్రసాద్ వసంతరాయపురంలోని తన ఇంటి వద్ద బైక్ ఆపే సమయంలో ఒక యువకుడు బైక్ పై వచ్చి పడిపోతున్నట్లు నటించి ప్రసాద్ సాయం అడిగాడు. అయితే ప్రసాద్ గత సంఘటన గుర్తు రావడంతో తన సెల్ ఫోన్ ను సరి చూసుకుంటూ బైక్ వద్దకు వెళ్లలేదు. వెంటనే మరోక యువకుడు అక్కడకు వచ్చి ఇద్దరూ కలిసి తమ ప్లాన్ వికటించడంతో అక్కడ నుండి వెళ్లి పోయారు. దీంతో ప్రసాద్ తన సెల్ ఫోన్ కొట్టేయడానికి మరోసారి స్కెచ్ వేసినట్లు అర్ధమైంది. వెంటనే తన ఇంటి వద్ద నున్న సిసి కెమెరా విజువల్స్ పరిశీలించగా ఇద్దరూ యువకులు అక్కడ వరకూ కలిసే వచ్చి అక్కడే పడిపోతున్నట్లు ఒక యువకుడు నటించడం మరొక యువకుడు తోడు రావడం కనిపించింది. సాయం చేయడానికి ప్రసాద్ వెళ్లి ఉంటే రెండో సారి కూడా సెల్ ఫోన్ దొంగలించే వాళ్లే.

ఈ ఘటనపై కూడా ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఘటనలు నగరంలో ప్రతి రోజూ ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. దీంతో పోలీసులు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా ఉన్న సమయంలోనే ఇటువంటి దొంగతనాలకు స్కెచ్ వేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఏది ఏమైనా ఖరీదైన సెల్ ఫోన్లు వాడుతున్న వినియోగదారులు మాత్రం ఇటువంటి చోరీల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..