Crime News: కర్నూలు జిల్లాలో దారుణం.. స్కూల్ కరస్పాండెంట్ పైశాచికత్వం.. ఆరో తరగతి విద్యార్థిపై..

Crime News: కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థిపై స్కూల్ కరస్పాండెంట్ పైశాచికత్వం ప్రదర్శించాడు.

Crime News: కర్నూలు జిల్లాలో దారుణం.. స్కూల్ కరస్పాండెంట్ పైశాచికత్వం.. ఆరో తరగతి విద్యార్థిపై..

Updated on: Feb 19, 2021 | 9:54 PM

Crime News: కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థిపై స్కూల్ కరస్పాండెంట్ పైశాచికత్వం ప్రదర్శించాడు. తీవ్రంగా దాడి చేయడంతో.. విద్యార్థి ఆస్పత్రిపాలయ్యాడు. పూర్తి వివరాల్లోకెళితే.. బనగానపల్లె పట్టణంలోని నెహ్రూ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో అబ్దుల్ రజాక్ ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే, వివిధ కారణాలతో స్కూల్ కరస్పాండెంట్ రవితేజ.. విద్యార్థి అబ్దుల్ రజాక్‌పై కర్రతో తీవ్రంగా చితకబాదాడు. దాంతో రజాక్ స్కూల్‌లోనే సొమ్మసిల్లి పడిపోయాడు. విషయం తెలుసుకున్న రజాక్ తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ వద్దకు వచ్చి అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also read:

AP Local Body Elections: ఇవిగో వాస్తవాలు.. ఇప్పుడు చూపించండి.. చంద్రబాబుకు సజ్జల రామకృష్ణ స్ట్రాంగ్ కౌంటర్..

AP Local Body Elections: కర్నూలు జిల్లాలో హీరో వెంకటేష్‌కు ఓటు.. పేరు మాత్రం ఆయనది కాదు..