అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. బొమ్మనహాళ్ మండలం దర్గా హొన్నూరులో ఈ ఘటన జరిగింది. పంట కోతలు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. మెయిన్‌లైన్ తీగలు కావడంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యారు. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కాగా.. పొలం పనులకు వెళ్లిన వారు ఊహించని ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో మృతుల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..