AP News: అనకాపల్లి జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి అక్కా, తమ్ముడు మృతి..

Sister and brother fell into a well: ఏపీలోని అనకాపల్లి జిల్లా (Anakapalle District) లో విషాదం చోటుచేసుకుంది. సబ్బవరం మండలం బంగారమ్మ పాలేంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు..

AP News: అనకాపల్లి జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి అక్కా, తమ్ముడు మృతి..
Anakapalle

Updated on: May 01, 2022 | 9:03 AM

Sister and brother fell into a well: ఏపీలోని అనకాపల్లి జిల్లా (Anakapalle District) లో విషాదం చోటుచేసుకుంది. సబ్బవరం మండలం బంగారమ్మ పాలేంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు.. ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి మృతిచెందారు. బంగారం పాలెం గ్రామానికి చెందిన దొడ్డి శ్రీను రేవతి దంపతులకు జాహ్నవి (13), దినేష్ (10) సంతానం. జాహ్నవి అదే గ్రామంలో యు.పీ స్కూల్లో 5వ తరగతి చదువుతుండగా, దినేష్ ఆరిపాక సూర్య ప్రకాష్ కాన్వెంట్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. వీరిద్దరూ కలిసి సైకిల్ తొక్కేందుకు శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఊరికి దూరంగా తమ పొలాల వైపు వెళ్లారు. అయితే.. వారు సాయంత్రం వరకు కూడా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు వెతికారు. దీంతో ఆ గ్రామానికి దూరంగా ఉన్న ముత్యాలమ్మ తల్లి ఆలయం సమీపంలోని అప్పలనాయుడు వ్యవసాయ బావి వద్ద సైకిలు పిల్లల చెప్పులు కనిపించాయి. దీంతో గ్రామస్థులు బావిలో వెతకగా.. మృతదేహాలు బయటపడ్డాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మరణించడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు..

కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరూ నీళ్ళు తాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు పడి మృతి చెందారా? లేక ఈత కొట్టేందుకు దిగి.. మరణించారా..? అనేది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

AP News: రేపల్లె రైల్వే స్టేషన్‌లో ఘోరం.. భర్తను కొట్టి భార్యపై గ్యాంగ్ రేప్.. ట్రైన్ కోసం వేచి ఉండగా..

AP Crime News: అంతా మాయ..! సత్తుపల్లి టు సత్తెనపల్లి.. తెలుగు రాష్ట్రాల్లో ఫేక్ కరెన్సీ కలకలం..