
సమయానికి ఇంట్లో ఉండకపోతే ఓటు గల్లంతేనా? ఓటరు కొత్త ప్రాంతానికి మారితే ఏమవుతుంది? అధికారులపై ప్రభుత్వాల పెత్తనం సాధ్యమేనా? అపోజిషన్ పార్టీలకు ఓటుగండం… నిజమేనా? అధికారపార్టీలు కూడా ఎందుకు ఉలిక్కిపడుతున్నట్టు? హైదరాబాద్‌లో సెటిలైన ఆంధ్రా ఓటర్ల గతేంటి? తెలుగు రాష్ట్రాల్లో ఓట్లు తగ్గుతాయా, పెరుగుతాయాసర్ పూర్తయ్యేదాకా తప్పదా పొలిటికల్ తకరారు? మిలియన్ డాలర్ల క్వశ్చన్లతో మోత మోగిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ. అనుమానం పెనుభూతాలౌతున్నాయి. సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలంటూ అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ రెండువారాల కిందటే స్పెషల్ ఎక్సర్‌సైజ్ చేశాయి. పార్టీ క్యాడర్‌ని సమాయత్తం చేసుకున్నాయి. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన వర్క్‌షాప్‌లో ఐతే కూటమి పార్టీల మధ్య విభేదాలు కూడా చర్చకొచ్చాయి. మిత్రధర్మాన్ని ప్రతి నేతా, ప్రతి కార్యకర్తా పాటించాల్సిందేనని హెచ్చరించారు. ఒక పార్టీకి చెందిన ఓట్ల మీద మరో పార్టీ కన్నేస్తాయని చెప్పకనే చెప్పారు. SIR ప్రక్రియను అందరూ సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఉన్న ఓట్లను కాపాడుకోవడమే కాదు, కొత్త ఓట్ల చేరికను కూడా ఛాలెంజ్‌గా తీసుకోవాలన్నారు. చూస్తుండగానే జూన్ 15 రానే వచ్చింది. ఏపీలో ఇంటింటి సర్వే షురూ ఐంది. బూత్ లెవల్ ఆఫీసర్లు ఓటర్ల వివరాలు సేకరించి, ఎన్యుమరేషన్ ఫామ్స్ అందిస్తున్నారు. ఓటర్లు తమ వివరాలు పూర్తి చేసి,...