విజయవాడ డివిజన్ రైలు ప్రయాణికులకు అలెర్ట్.. పలు రైళ్లు రద్దు

| Edited By: Ram Naramaneni

Nov 06, 2023 | 10:59 AM

భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణముగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ముఖ్యంగా డివిజన్ పరిధిలోని కీలకమైన రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. మరికొన్ని రైళ్లను కూడా దారి మళ్లించినట్లు SCR అధికారులు తెలిపారు. దీంతో వారం పాటు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు.

విజయవాడ డివిజన్ రైలు ప్రయాణికులకు అలెర్ట్.. పలు రైళ్లు రద్దు
Vijayawada Trains
Follow us on

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లను వారం రోజులపాటు రద్దు చేశారు అధికారులు. భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణముగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ముఖ్యంగా డివిజన్ పరిధిలోని కీలకమైన రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. మరికొన్ని రైళ్లను కూడా దారి మళ్లించినట్లు SCR అధికారులు తెలిపారు. దీంతో వారం పాటు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు.

రద్దు చేసిన రైళ్ల వివరాలివే

నవంబర్ 6 వ తేదీ నుంచి 12 వ తేదీ వరకూ రద్దైన రైళ్లు

  1. 17239 – గుంటూరు – విశాఖ సింహాద్రి ఎక్స్ ప్రెస్.
  2. 07466 – రాజమండ్రి – విశాఖ మెమూ ఎక్స్ ప్రెస్
  3. 07467 – విశాఖ – రాజమండ్రి మెమూ ఎక్స్ ప్రెస్
  4. 17267 – కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం.
  5. 17268 – విశాఖపట్నం – కాకినాడ పోర్ట్
  6. 12717 – విశాఖపట్నం – విజయవాడ.
  7. 12718 – విజయవాడ – విశాఖపట్నం.
  8. 17219 – మచిలీపట్నం – విశాఖపట్నం.
  9. 17243 – గుంటూరు – రాయగడ.
  10. నవంబర్ 7 వ తేదీ నుంచి 13 వ తేదీ వరకూ రద్దైన రైళ్లు
  11. 17220 – విశాఖపట్నం – మచిలీపట్నం.
  12. 17244 – రాయగడ – గుంటూరు

దీపావళికి స్పెషల్ ట్రైన్స్

దీపావళి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.  ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

  • 06073 – ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ – భువనేశ్వర్‌ – ఈ స్పెషల్ ట్రైన్ నవంబర్‌ 13, 20, 27 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ రాత్రి 11.45 గంటలకు చెన్నైలో స్టార్టయ్యి.. తర్వాతి రోజు ఉదయం 11.15 గంటలకు దువ్వాడ వస్తుంది. ఆ తర్వాత 11.20 గంటలకు బయలుదేరి.. సాయంత్రం 6:30కు భువనేశ్వర్ చేరుకుంటుందని వెల్లడించారు.
  • 06074 – భువనేశ్వర్‌ – చెన్నై సెంట్రల్‌  –  నవంబర్ 14, 21, 28 తేదీల్లో ఈ ట్రైన్ సర్వీసులు ఉంటాయి. రాత్రి 9 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి.. తరువాతి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు దువ్వాడ వస్తుంది. ఇక్కడి నుంచి తిరిగి 3.50 గంటలకు స్టార్టయ్యి వెళ్తుందని అధికారులు తెలిపారు. చెన్నై – భవనేశ్వర్ రైళ్లు ఆంధ్రాలోని గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్ధా రోడ్డు రైల్వే స్టేషన్లలో ఆగుతాయని రైల్వే శాఖ తెలిపింది

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..