Earthquake: తిరుపతి సమీపంలో భూ ప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

|

Apr 03, 2022 | 11:35 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి(Tirupati) సమీపంలో స్వల్ప భూప్రకంప‌న‌లు(Earthquake) చోటు చేసుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 1.10 గంట‌ల స‌మ‌యంలో తిరుప‌తికి స‌మీపంలోని ప్రాంతాల్లో భూమి కంపించినట్లు నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్కాల‌జీ...

Earthquake: తిరుపతి సమీపంలో భూ ప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
Earthquake
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి(Tirupati) సమీపంలో స్వల్ప భూప్రకంప‌న‌లు(Earthquake) చోటు చేసుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 1.10 గంట‌ల స‌మ‌యంలో తిరుప‌తికి స‌మీపంలోని ప్రాంతాల్లో భూమి కంపించినట్లు నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్కాల‌జీ తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.6గా న‌మోదు అయింది. భూకంప కేంద్రం తిరుప‌తి నగరానికి 85 కిలో మీట‌ర్ల దూరంలో, భూఅంత‌ర్భాగంలో 20 కిలోమీట‌ర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. అర్థరాత్రి స‌మ‌యంలో భూప్రకంప‌న‌లు చోటు చేసుకోవ‌డంతో ప్రజ‌లు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి న‌ష్టం వాటిల్లకపోవడం అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. భూప్రకంపనల క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Also Read

Deepak Chahar: చెన్నై సూపర్‌ కింగ్స్ అభిమానులకు శుభవార్త.. జట్టులో చేరనున్న దీపక్ చాహర్..

Betel Nuts: వక్కపొడి తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

Stock Market: FIIలు ఎందుకు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు..