AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepak Chahar: చెన్నై సూపర్‌ కింగ్స్ అభిమానులకు శుభవార్త.. జట్టులో చేరనున్న దీపక్ చాహర్..

చెన్నై సూపర్‌ కింగ్స్(CSK) అభిమానులకు శుభవార్త అందింది. ఆ జట్టు కీలక బౌలర్‌ దీపక్‌ చాహర్‌(Deepak Chahar) బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు...

Deepak Chahar: చెన్నై సూపర్‌ కింగ్స్ అభిమానులకు శుభవార్త.. జట్టులో చేరనున్న దీపక్ చాహర్..
Deepak
Srinivas Chekkilla
|

Updated on: Apr 03, 2022 | 11:18 AM

Share

చెన్నై సూపర్‌ కింగ్స్(CSK) అభిమానులకు శుభవార్త అందింది. ఆ జట్టు కీలక బౌలర్‌ దీపక్‌ చాహర్‌(Deepak Chahar) బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. వేలంలో రూ.14 కోట్లు పెట్టి చాహర్‌ను తిరిగి దక్కించుకున్న చెన్నై అతడి సేవల కోసం ఎదురు చూస్తోంది. ఐపీఎల్ 2022(IPL) సీఎస్కే ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఆదివారం పంజాబ్‌తో జరిగే మూడో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో చాహర్‌ నెట్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టడం ఆ జట్టుకు సంతోషాన్నిచ్చే విషయం. డెత్‌ ఓవర్లలో చాహర్‌ లాంటి పేసర్‌ లేని లోటు తొలి రెండు మ్యాచ్‌ల్లో చెన్నైకు చాలా స్పష్టంగా తెలిసొచ్చింది. గత సీజన్లో చెన్నై విజేతగా నిలవడంతో కీలకపాత్ర పోషించాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై జట్టు ఒకటి. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఈ జట్టు నాలుగు టైటిళ్లను కైవసం చేసుకుంది. కానీ ఈ సీజన్ ప్రారంభానికి రెండు రోజుల ముందు ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుని రవీంద్ర జడేజాకు కమాండ్ అప్పగించాడు. జట్టు వారసత్వాన్ని నిలబెట్టుకోవడం జడేజాకు సవాల్‌గా మారింది. గత 15 సీజన్లలో ఇరు జట్ల మధ్య 26 మ్యాచ్‌లు జరిగాయి. ఈ 26 మ్యాచ్‌ల్లో చెన్నై 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ 10 విజయాలను సొంతం చేసుకుంది. గత సీజన్‌లో ఇరు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. ఏప్రిల్ 16న జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ విజయం సాధించింది.

Read Also.. IPL 2022: ముంబై, రాజస్థాన్‌ మ్యాచ్‌లో తప్పిన ప్రమాదం.. తిలక్‌ వర్మ సిక్స్‌తో గాయపడిన కెమెరామెన్.. వైరల్‌ అయిన వీడియో..

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..