AP Local Body Elections: గుంటూరులో దారుణం.. సర్పంచ్‌గా నామినేషన్ వేశాడని రైతుబజార్‌లో షాపులు మూసివేయించారు..

AP Local Body Elections: గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు మండలం దోసపాలెం రైతులకు గుంటూరు రైతు బజార్‌లో వేధింపులు ఎదురవుతున్నాయి.

AP Local Body Elections: గుంటూరులో దారుణం.. సర్పంచ్‌గా నామినేషన్ వేశాడని రైతుబజార్‌లో షాపులు మూసివేయించారు..

Updated on: Feb 12, 2021 | 12:58 PM

AP Local Body Elections: గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు మండలం దోసపాలెం రైతులకు గుంటూరు రైతు బజార్‌లో వేధింపులు ఎదురవుతున్నాయి. దోసపాలెం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారనే కారణంతో రైతు బజార్‌లో ఆ ఊరికి కేటాయించిన 20 షాపులను నిలిపివేశారు. పూర్తి వివరాల్లోకెళితే.. దోసపాలెంలో వైసీపీకి పోటీగా బిక్షాలరావు అనే రైతు నామినేషన్ వేశాడు. దాంతో వైసీపీ నేతలు ఆతనిపై ఆగ్రహించారు. పట్టాభిపురం రైతు బజార్‌లో దోసపాలెం రైతులకు కేటాయించిన షాపులను నిలిపివేశారు. 20 ఏళ్లుగా ఉన్న షాపులను నిలిపివేసి షాపు నిర్వాహకులను అధికారులు బయటకు పంపించేశారు. నామినేషన్ విత్ డ్రా చేసుకుంటేనే షాపులు తిరిగి అప్పగిస్తామంటూ అధికారులు వారికి వార్నింగ్ ఇచ్చారు. అయితే అధికారుల చర్యలపై రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు రాజకీయాలు ఆపాదించడం సరికాదంటూ దోసపాలెం రైతులు వేడుకుంటున్నారు. షాపులను కేటాయించి తమకు న్యాయం చేయాలంటూ అధికారులను రైతు కోరారు.

Also read:

Air Charges Hiked: ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. మరింత భారంగా మారనున్న విమాన ప్రయాణం.!

క్యాంప్‌ ఆఫీస్‌పై క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్‌.. మోతే శ్రీలతశోభన్‌రెడ్డిని సత్కరించిన పద్మారావుగౌడ్‌