
పండగకు వచ్చి తిరిగి వెళ్లిన తెల్లారే జూనియర్ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన నంద్యాల జిల్లా సంత జుటూరు గ్రామంలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన జూనియర్ డాక్టర్ గీతాంజలి ప్రస్తుతం నెల్లూరు మెడికల్ కాలేజీలో చదువుకుంటుంది. ఇటీవలే దసరా పండుగ సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన గీతాంజలి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులుతో ఆనందంగా గడిపింది. ఇక గురువారం రాత్రి తిరిగి నెల్లూరులోకి కాలేజ్‌కు బయల్దేరింది. శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది.
మరోవైపు గురువారం స్వయంగా తానే వచ్చి కూతురిని బస్సు ఎక్కించి వెళ్లాడు గీతాంజలి తండ్రి. కానీ కూతురిని పంపిన తెల్లారే ఆమె మరణవార్త వినాల్సివస్తుందని ఆయన అనుకోలేదు. విషయం తెలిసిన వెంటనే గీతాంజలి తల్లిదండ్రులు, బంధుమిత్రులు హుటాహుటీన నెల్లూరుకు బయల్దేరారు. కూతురిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ తల్లిదండ్రుల ఆవేదన చూసిన గ్రామస్తులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.