AP News: సాధారణ తనిఖీలు.. బొలెరో వాహనాన్ని ఆపి చెక్ చేయగా.. పోలీసుల దిమ్మతిరిగిపోయింది.!

| Edited By: Janardhan Veluru

Jan 04, 2024 | 6:34 PM

గంజాయి స్మగ్లర్లు బరితెగిస్తున్నారు. పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా.. మరింత మందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెడుతున్నా.. పోలీసుల కళ్లు గప్పి గంజాయి తరలించకుపోతూనే ఉన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాలు కూడా.. గంజాయిపై దూకుడు పెంచారు. ప్రభుత్వ ఆదేశాలతో నిఘా పెంచి స్మగ్లర్ల ఆట పట్టిస్తున్నారు.

AP News: సాధారణ తనిఖీలు.. బొలెరో వాహనాన్ని ఆపి చెక్ చేయగా.. పోలీసుల దిమ్మతిరిగిపోయింది.!
Representative Image
Follow us on

గంజాయి స్మగ్లర్లు బరితెగిస్తున్నారు. పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా.. మరింత మందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెడుతున్నా.. పోలీసుల కళ్లు గప్పి గంజాయి తరలించకుపోతూనే ఉన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాలు కూడా.. గంజాయిపై దూకుడు పెంచారు. ప్రభుత్వ ఆదేశాలతో నిఘా పెంచి స్మగ్లర్ల ఆట పట్టిస్తున్నారు. తాజాగా అల్లూరి జిల్లా పెదబయలు జంక్షన్‌లో.. తనిఖీలు చేసిన పోలీసులకు భారీగా గంజాయి బయటపడింది. అదే సమయంలో ఒక తుపాకీ కూడా..!

అల్లూరి జిల్లాలో గంజాయిని తరలిస్తున్న ముఠా వద్ద పిస్టల్ లభించడం కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదబయలు మండలం కొత్త రూడకోట జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా ఓ వాహనం కనిపించింది. బొలెరో ఆపి తనిఖీలు చేసేసరికి.. అందులో గంజాయి ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. జి మాడుగుల సీఐ రమేష్ ఆధ్వర్యంలో.. పెదబయలు పోలీసులు వాహనమంతా ముమ్మరంగా తనిఖీలు చేశారు. 420 కిలోల గంజాయితో ఐదుగురు స్మగ్లర్లను ముఠా అరెస్ట్ చేశారు. పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి పది లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితుల్లో ముగ్గురు ఒడిస్సాకు చెందినవారు కాగా.. మరో ఇద్దరు అల్లూరి జిల్లా వాసులని పోలీసులు గుర్తించారు. గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ముంచంగిపుట్టి మండలం మూసిపుట్టులో కొనుగోలు చేసి ఒడిస్సా సిమిలిగూడకు తరలిస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు.

Alluri Dist Police

అయితే స్మగ్లర్ల వద్ద పిస్టల్ పట్టుబడడంతో పోలీసులు అవాక్కయ్యారు. గంజాయి తరలిస్తున్న క్రమంలో.. ఎవరైనా అడ్డుపడితే తుపాకితో బెదిరించేందుకు సిద్ధం చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఐదు రౌండ్ల బుల్లెట్లు కూడా ఉండడంతో.. అవసరమైతే ఫైరింగ్ చేసేందుకు కూడా ఈ స్మగ్లర్లు ఉన్నారన్నది పోలీసుల అనుమానం.