చిత్తూరు జిల్లా పలమనేరులో పదో తరగతి విద్యార్థిని మిస్బా ఆత్మహత్య(Suicide) కేసు విషయంపై సంచలమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రెండు రోజుల తర్వాత బయటపడ్డ సూసైడ్ నోట్ (Suicide Note) ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. స్కూల్ టాపర్ అంశం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. తమ కూతురు చదువులో చాలా చురుకుగా ఉండేదని, అంతే కాకుండా టాపర్ గా ఉండటమే శాపంగా మారిందని విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక వైసీపీ నేత కూతురే స్కూల్లో టాపర్(School Topper) గా ఉండాలని ప్రిన్సిపాల్, సిబ్బంది ప్రయత్నించారని, వారి ఒత్తిడులు తట్టుకోలేక తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని కన్నీటి పర్యంతమయ్యారు. మిస్బా ఆత్మహత్యకు వైసీపీ నేతలే కారణమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చి, అండగా ఉండి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఏం జరిగిందంటే..
చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పట్టణంలోని రాధాబంగ్లా ప్రాంతానికి చెందిన వజీర్ కూతురు మిస్బా.. స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. టెన్త్ క్లాస్‌లో మిస్బా, మరో బాలిక టాపర్లుగా పోటీపడి చదువుతున్నారు. పిల్లల మధ్య జరిగే చిన్నపాటి విషయాల కారణంగా తరచూ పాఠశాల బినామీ కరస్పాండెంట్ రమేష్ మిస్బా తల్లిదండ్రులను చులకనగా మాట్లాడేవాడు. ఒకే తరగతిలో ఇద్దరి మధ్య చదువులో పోటీ ఉందని, పరీక్షలు ఇక్కడే రాసినా కొన్నాళ్లు వేరే స్కూల్‌కు పంపుదామని కరస్పాండెంట్ చెప్పారు. దీంతో రెండ్రోజుల నుంచి మరో స్కూల్ కు మిస్బా వెళ్తోంది. పాఠశాల నుంచి ఇంటికొచ్చిన బాలిక స్కూల్ యూనిఫామ్ మార్చుకుంటానని గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
పట్టణంలో ఉద్రిక్తత..
మిస్బా ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్టు చేసే వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదంటూ మృతురాలి బంధువులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. స్కూల్ కరస్పాండెంట్, మరో స్కూల్ హెచ్‌ఎంను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీయడంతో పలమనేరు ఇన్‌చార్జ్ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి బాధితులతో మాట్లాడి పరారీలో ఉన్న నిందితులను 24 గంటల్లో అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read
Nikhil Siddharth: మాస్ మహారాజాతో పోటీపడుతున్న కుర్ర హీరో.. ఒకే రోజు రెండు సినిమాలు
Crime news: యువకునికి ఘోర అవమానం.. హిందూ దేవుళ్లను కించపరుస్తూ పోస్టు పెట్టాడని ఏం చేశారంటే