Andhra Pradesh: ఫ్రెండ్‌ఫిప్‌ డే రోజు తీవ్ర విషాదం.. స్నేహితుల కళ్ల ముందే..

| Edited By: Narender Vaitla

Aug 05, 2024 | 7:17 PM

స్నేహితుల దినోత్సవం ఎంతోమంది స్నేహితుల మధ్య ఒకచోట చేర్చి ఆనందాన్ని నింపితే.. మరి కొంతమందికి తీవ్ర విషాదంలో నెట్టేసింది. విశాఖ జిల్లాలో జరిగిన రెండు వేరువేరు ఘటనలు స్నేహితులతో పాటు ఆ కుటుంబాలకు అంతులేని ఆక్రోసాన్ని మిగిల్చింది. సంఘటనలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన...

Andhra Pradesh: ఫ్రెండ్‌ఫిప్‌ డే రోజు తీవ్ర విషాదం.. స్నేహితుల కళ్ల ముందే..
Andhrapradesh
Follow us on

స్నేహితుల దినోత్సవం ఎంతోమంది స్నేహితుల మధ్య ఒకచోట చేర్చి ఆనందాన్ని నింపితే.. మరి కొంతమందికి తీవ్ర విషాదంలో నెట్టేసింది. విశాఖ జిల్లాలో జరిగిన రెండు వేరువేరు ఘటనలు స్నేహితులతో పాటు ఆ కుటుంబాలకు అంతులేని ఆక్రోసాన్ని మిగిల్చింది. సంఘటనలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన నిరంజన్‌, విశాఖకు చెందిన యశ్వంత్‌, ఆశిష్‌, హైదరాబాద్‌కు చెందిన రెహాన్.. తాడేపల్లిగూడేనికి చెందిన లలిత్‌ విశాఖలోని గీతం కళాశాలలో ఇంజనీరింగ్‌ చదువుతున్నారు.

స్నేహితుల దినోత్సవం కావడంతో సరదాగా గడిపేందుకు గంభీరం రిజర్వాయర్‌కు చేరుకున్నారు. సరదాగా గడుపుతుండగా నిరంజన్‌ సెల్ఫీ తీసుకున్నందుకు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు కాలుజారి రిజర్వాయర్‌లో పడిపోయాడు. నిరంజన్‌ను రక్షించేంందుకు యశ్వంత్‌, ఆశిష్‌ నీటిలో దూకారు. అయితే ముగ్గురికీ సరిగా ఈత రాకపోవడంతో మిగిలిన ఇద్దరూ నీటిలో మునిగిపోతున్నారు. దీంతో అప్రమత్తమైన స్థానికుల రిజర్వాయర్‌లోకి దూకి కాపాడే ప్రయత్నం చేశారు.

అయితే యశ్వంత్‌, ఆశిష్‌లను సురక్షితంగా బయటకు తీసినా, నిరంజన్‌ జాడ కనిపించలేదు. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు గాలింపు చర్యలు చేపట్టి, మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భీమిలి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్కే బీచ్‌లో..

విశాఖ మాధవధారకు చెందిన నలుగురు విద్యార్థులు ఆర్కే బీచ్ కి వెళ్లారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆర్కే బీచ్‌లో సరదాగా గడిపారు. మాధవధార గవర్నమెంట్ స్కూల్లో ఆరవ తరగతి క్లాస్ చదువుతున్న బొంతల ప్రవీణ్ కుమార్.. ఒక్కసారిగా అలలోకి కొట్టుకుపోయాడు. మిగిలిన స్నేహితులు కేకలు పెట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అలల్లో చిక్కుకుని కొట్టుకుపోతుండగా అక్కడే ఉన్న గజ ఈతగాళ్లు అలర్ట్ అయ్యారు. బయటికి తీసుకు వచ్చి సపర్యలు చేసి కొనఊపిరితో ఉన్న బాబుని కేజీహెచ్ కు తరలించారు. కొనఊపిరి తో కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలుడు మృతిచెందాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..