Nagababu: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్న జనసేన నేత నాగబాబు రహస్య పర్యటన

| Edited By: Balaraju Goud

Jan 05, 2024 | 4:31 PM

ఉత్తరాంధ్రలో మెజారిటీ స్థానాలు దక్కించుకునేందుకు జనసేన వ్యూహం పన్నుతోంది. అందుకు అవసరమైన సన్నాహక ఏర్పాట్లలో ఆ పార్టీ సీనియర్ నేత నాగబాబు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా విశాఖ లో పర్యటించారు. ఒక వైపు తెలుగుదేశం పార్టీ - జనసేనలలో ఎవరికి టికెట్ వచ్చినా రెండు పార్టీలు కలిసి చేయాలని చెప్తూనే, మరో వైపు ఎన్నికలకు అవసరమైన నిధుల సమీకరణపైనా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.

Nagababu: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్న జనసేన నేత నాగబాబు రహస్య పర్యటన
Nagababu
Follow us on

ఉత్తరాంధ్రలో మెజారిటీ స్థానాలు దక్కించుకునేందుకు జనసేన వ్యూహం పన్నుతోంది. అందుకు అవసరమైన సన్నాహక ఏర్పాట్లలో ఆ పార్టీ సీనియర్ నేత నాగబాబు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా విశాఖ లో పర్యటించారు. ఒక వైపు తెలుగుదేశం పార్టీ – జనసేనలలో ఎవరికి టికెట్ వచ్చినా రెండు పార్టీలు కలిసి చేయాలని చెప్తూనే, మరో వైపు ఎన్నికలకు అవసరమైన నిధుల సమీకరణపైనా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్తలు ముందుకు వచ్చి పార్టీకి ఆర్థిక సహకారం అందించాలని కోరారట. అయితే ఈ సమావేశాన్ని రహస్యంగా నిర్వహించారట. మొబైల్ ఫోన్లను కూడా అనుమతించకుండా నిన్న విశాఖలో సమావేశాన్ని నిర్వహించారట నాగబాబు.

తెలుగుదేశం పార్టీతో పొత్తైతే కుదిరింది. కానీ ఆ తర్వాత జరగాల్సిన పరిణామాలపై జనసేన పార్టీ కసరత్తు ప్రారంభించింది. ప్రధానంగా ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల ఎంపిక, పోటీ చేసే స్థానాల గుర్తింపు, వాటికంటే భిన్నంగా మరింత ముఖ్యంగా పార్టీకి ఆదాయ వనరుల సమకూర్పులాంటి అంశాలపై జనసేన ప్రత్యేక దృష్టి సారించిందట. అందుకోసం నాగబాబుని ఇన్‌చార్జిగా నియమించిందట. అందుకే నాగబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇందులో ఆయన పర్యటనలను రెండు భాగాలుగా విభజించారట. ఒకటి పార్టీ పోటీ చేయాల్సిన స్థానాల ఎంపిక, అక్కడ బలాబలాలపై చర్చతో పాటు బలమైన అభ్యర్థుల గుర్తింపు కార్యక్రమాన్ని చేస్తున్నారట.

కాగా ఇక రెండవది ఎన్నికలకు ఆర్థిక వనరుల సమకూర్పు. ఈ రెండు అంశాలను సమాంతరంగా పార్టీలోని క్రియాశీలక నేతలతో అదే సమయంలో ప్రధానమైన కాపు సామాజిక వర్గంతో విడివిడిగా భేటీలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారట నాగబాబు. అందులో భాగంగానే విశాఖ వచ్చిన నాగబాబు గాదిరాజు కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ సమావేశానికి మొబైల్ ఫోన్లను కూడా అనుమతించకపోవడంతో ఆ సమావేశాన్ని అత్యంత రహస్యంగానే నిర్వహించినట్టు చెబుతున్నారు. కనీసం ఆ విజువల్స్‌ కూడా ఎవరికి షేర్ చేయనట్టుగా అర్థమవుతుంది.

అయితే మొదటి సమావేశంలో ఉత్తరాంధ్రలో పోటీ చేయాల్సిన అసెంబ్లీ నియోజకవర్గాల గురించి చర్చించారట. శ్రీకాకుళం విజయనగరం, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడైతే పోటీ చేస్తే విజయావకాశాలు ఉంటాయన్న దానిపైన ప్రధానంగా చర్చ జరిగిందట. 2009లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసిన సమయంలో గెలుపొందిన స్థానాలతో పాటు మరికొన్ని అదనంగా కూడా గుర్తించాలని పార్టీ నేతలను నాగబాబు కోరారట. పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్న బలమైన అభ్యర్థుల గురించి కూడా చర్చించారట. ఒకవేళ ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో పోటీ చేస్తే టిడిపి నేతలతో సమన్వయం ఎలా ఉంటుంది? పోటీ చేసే నేతలలో ఆర్థికమైన ఆర్థికంగా బలమైన నేతలు ఎవరున్నారు? అన్న కోణంలో చర్చ జరిగిందట. దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ ఉత్తరాంధ్రలోని మొత్తం 34 స్థానాల్లో కనీసం 7 నుంచి 8 స్థానాలని అడగాలన్న లక్ష్యంతో ఉన్నారట. రెండవ

ఈ మొత్తం సమావేశంలో అత్యంత కీలకమైన ఎపిసోడ్ కాపు సామాజిక వర్గంలోని ముఖ్య వ్యాపారవేతలని ఆహ్వానించారట. కానీ బడా వ్యాపారవేత్తలు ఎవరూ ఈ సమావేశానికి హాజరు కాకపోయినప్పటికీ ఇటీవల జనసేనలో చేరిన సుందరపు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కొంతమంది స్థానిక బిల్డర్లు, ఇతర వ్యాపార వేత్తలు హాజరయ్యారట. వారిని ఉద్దేశించి నాగబాబు మాట్లాడుతూ ఈ సమయంలో ఆర్థికంగా సహకారం కావాలని, లేదంటే సామాజిక వర్గం శాశ్వతంగా వెనకబడిపోతుందన్న సందేశాన్ని ఇచ్చారట. రాజకీయంగా అధికారాన్ని దక్కించుకోవాలంటే చాలా వ్యూహం అవసరం అని, పవన్ కళ్యాణ్ పగడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారని, ఇందుకు సామాజిక వర్గ మద్దతు కూడా కావాలని నాగబాబు కోరినట్టు ప్రస్తుతం చర్చ జరుగుతుంది.

అయితే ఆ సమావేశానికి ఎవరు హాజరయ్యారు? ఎలాంటి స్పందన వచ్చిందన్నది బయటికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు కానీ ఆర్థిక వనరుల సమీకరణకు సంబంధించి కీలకమైన చర్చ జరిగినట్టు సమాచారం. అదే సమయంలో ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ ఉండాలన్న డిమాండ్ ప్రస్తుతం వినిపించవద్దని, ఎన్నికల్లో ఫలితాలను బట్టి మెరుగైన స్థానాలు దక్కించుకుంటే అప్పుడు అడిగే అవకాశం ఉంటుందని నాగబాబు చెప్పారట.

అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించాలని ఆయన కోరారట. ఈ నేపథ్యంలో నాగబాబు రహస్య పర్యటన ప్రస్తుతం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకి తావిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…