రెండో డిప్యూటీ మేయర్, రెండో వైఎస్ ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్.. ఈ నెల 30న పురపాలికల ప్రత్యేక సమావేశం

|

Jul 24, 2021 | 7:04 AM

Second Deputy Mayor in Corporations and Vice Chairman in Municipalities: 11 కార్పోరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్, 75 మున్సిపాలిటీలు,నగర పంచాయతీల్లో రెండో వైస్ ఛైర్మన్ ఎన్నికకు ఎస్ఈసీ నోటిఫికేషన్.

రెండో డిప్యూటీ మేయర్, రెండో వైఎస్ ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్.. ఈ నెల 30న పురపాలికల ప్రత్యేక సమావేశం
Sec Notification For Election
Follow us on

State Election Commission Notification: ఆంధ్రప్రదేశ్ సంచలన నిర్ణయం తీసుకుంది. 11 కార్పోరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్,75 మున్సిపాలిటీలు,నగర పంచాయతీల్లో రెండో వైస్ ఛైర్మన్ ఎన్నికోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. పరోక్ష పద్దతిలో రెండో డిప్యూటీ మేయర్, రెండో వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 30న మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేక సమావేశానికి ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవల ముగిసిన పురపాలక స్థానిక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయరు, వైస్‌ ఛైర్‌పర్సన్ల ఎన్నికకు ఎస్‌ఈసీ చర్యలు చేపట్టింది. రెండో డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లను నియమించాలన్న రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 11 మున్సిపల్‌ కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కోసం ఎస్‌ఈసీ ప్రకటన జారీ చేసింది. 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో రెండో వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఎన్నికకూ ప్రకటన వెలువడింది. ఈ ఎన్నిక కోసం ఈనెల 30న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఎస్ఈసీ.. కొత్తగా ఎన్నికైన సభ్యులు, ఎక్స్‌ అఫిషియో సభ్యులను తప్పనిసరిగా హాజరు కావాలని ఎస్ఈసీ కోరారు. ఈనెల 26 లోపు సమావేశ వివరాలతో సమాచారం అందించాలని ఎస్‌ఈసీ కోరారు. మరోవైపు, ఏలూరు కార్పొరేషన్‌లోనూ ఈనెల 30నే మేయర్‌, ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహించనున్నట్టు ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.

ఇదిలావుంటే, రాష్ట్రంలోని కార్పోరేషన్లలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు,మున్సిపాలిటీలు,నగరపంచాయతీల్లో ఇద్దరు వైఎస్ ఛైర్మన్ల నియామకానికి వీలుగా మున్సిపల్ చట్టంలో సవరణలు చేస్తూ ఈ ఏడాది మార్చిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర సర్కార్ వెల్లడించింది. రాష్ట్ర కేబినెట్‌లోనూ ఐదుగురు డిప్యూటీ సీఎంలకు అవకాశం కల్పించిన సీఎం జగన్… పట్టణ స్థానిక సంస్థల్లోనూ అదే పంథాను అనుసరించారు. మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ పదవులకు పార్టీలో తీవ్ర పోటీ నెలకొనడంతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదన కూడా వినిపిస్తుంది. దీంతో సాధ్యమైనంత ఎక్కువమందికి అవకాశం కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతారు.

Read Also…  KTR Birthday : వరంగల్‌లో వెరైటీగా కేటీఆర్ బర్త్ డే, స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసిన ఎర్రబెల్లి, నన్నపునేని