
తూనీగలు ఒక్కసారిగా గాల్లోకి లేస్తే వాన రాబోతోందని అర్థం. తంగేడు పూలు విరగబూస్తే వర్షాలు ఎక్కువ ఉంటాయని నమ్మకం. గ్రహణం రోజు పక్షుల అరుపులు ఒక సంకేతం. సునామీకి ముందు పక్షుల అరుపులతో మేల్కొన్న జంతుజాలం ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాయన్నది నిజం. దాన్ని ప్రకృతి ప్రసాదించిన దివ్యత్వంగా చూడాలా, అందులో సైన్స్ లేదు కదా అని నమ్మకుండా ఉండాలా? మహా అయితే 3వేల జనాభా! 5 నెలల్లో 30 మంది మృత్యువాత! మరిప్పుడేంటి… పరిస్థితి? శివయ్య వచ్చాడు. గుమ్మం ముందు నిలబడి ఇంకేం భయం లేదన్నాడు. మరణాలు ఆగింది అందుకేనన్నది ఊరి జనం విశ్వాసం. అటు పోలేరమ్మ కూడా పలికింది. జలాభిషేకం చేయండి, శాంతిస్తానని చెప్పింది. అలా చేసినందుకే చావులు ఆగాయన్నది స్థానికుల విశ్వాసం. నిన్నమొన్నటి దాకా పరిస్థితి వేరు! తురకపాలెం జనానికి బొడ్రాయి శాపం! వైద్యులు చెబుతున్నది మాత్రం.. వ్యాధి కారణం!. ఏప్రిల్‌లో ఇద్దరు. మే నెలలో ముగ్గురు. జూన్‌లో ఇద్దరు, జులైలో 10 మంది, ఆగస్ట్‌లో మరో 10 మంది. ఒకరి దశ దిన కర్మలు పూర్తయ్యేలోపు మరొకరి చావు. గుంటూరు రూరల్‌లోని తురకపాలెంలో ఐదు నెలలుగా ఇదే సీన్. బయటకు రావడానికే భయపడేంత పరిస్థితి. జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వెళ్లారో.. ఇక వాళ్లు తిరిగొచ్చేది శవంగానే అనే భయం. దీనంతటికీ తురకపాలెం గ్రామస్తులు చెబుతున్న కారణం… బొడ్రాయి శాపం. కొన్నాళ్ల క్రితం బొడ్రాయితో పాటు నాలుగు దిక్కులు గవిటి రాయి ప్రతిష్టించారు. వాటిలో...