
కొత్త సంవత్సరం వస్తుండటంతో ఏపీ ప్రభుత్వం అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. పెండింగ్‌లో ఉన్న పథకాలను ప్రారంభించడంతో పాటు ఇప్పటికే ఉన్న పథకాల్లో మార్పులు చేస్తోంది. అలాగే అనేక కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. వివిధ వర్గాలకు ఉపయోగపడేలా కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. త్వరలో కొత్త సంవత్సరం వస్తున్న క్రమంలో కొత్త పధకాలను ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. అందులో భాగంగా తాజాగా మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేంటంటే..
ఏపీలోని గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. వారికి తాజాగా స్కాలర్ షిప్‌లను విడుదల చేసింది. ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వం గిరిజనులకు అందించే పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్‌ల్లో బకాయిలను పెండింగ్‌లో ఉంచింది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఇప్పుడు వాాటిని విడుదల చేశారు. దీంతో గిరిజన విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో అర్హులైన విద్యార్థులందరకీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ నిధులు జమ అయ్యాయి. 59,297 మందికి రూ.100.93 కోట్లు విడుదల చేశారు. దీని వల్ల గిరిజన విద్యార్థుల విద్య మరింత మెరుగవుతుందని గుమ్మడి సంధ్యారాణి స్ఫష్టం చేశారు. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేశామని, దీని వల్ల విద్యార్థులు లాభం పొందనున్నారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకెళ్తుందని, ఎప్పటికప్పుడు బకాయిలను విడుదల చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు.