West Godavari: జంగారెడ్డిగూడెంలో ఘోర విషాదం.. వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో విషాదం చోటుచేసుకుంది.

West Godavari:  జంగారెడ్డిగూడెంలో ఘోర విషాదం.. వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..
Rtc Bus Accident

Edited By:

Updated on: Dec 15, 2021 | 6:20 PM

పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ వంతెన రెయిలింగ్‌ను ఢీకొని ఆర్టీసీ బస్సు వాగులో పడింది. వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తొమ్మిది మంది ప్రయాణికులు మృతిచెందారు. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Allu Arjun: ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన బన్నీ.. అభిమానులే తన విలువైన ఆస్తి అని ప్రకటన

ఎవరైనా గుర్తించారా ఈ నడిచే నక్షత్రాన్ని.. చిన్నారి ఎదురుగా ఉన్న స్టార్ ఎవరో కనిపెట్టండి..?