RTA Rides: సీజనల్ బాదుడుకు ఆర్టీఏ అధికారుల కత్తెర.. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ బస్సులపై కేసులు..

|

Oct 13, 2021 | 10:50 AM

దసరా పండుగ సీజన్‌ వేళ...ప్రైవేట్‌ ట్రావెల్స్‌ రెచ్చిపోతున్నాయి. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై RTA అధికారుల కొరడా ఝులిపిస్తున్నారు. గుంటూరుజిల్లా కాజా టోల్‌గేట్‌ దగ్గర..

RTA Rides: సీజనల్ బాదుడుకు ఆర్టీఏ అధికారుల కత్తెర.. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ బస్సులపై కేసులు..
Rta Ride
Follow us on

దసరా పండుగ సీజన్‌ వేళ…ప్రైవేట్‌ ట్రావెల్స్‌ రెచ్చిపోతున్నాయి. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై RTA అధికారుల కొరడా ఝులిపిస్తున్నారు. గుంటూరుజిల్లా కాజా టోల్‌గేట్‌ దగ్గర ఈ ఉదయం నుంచి RTA అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. స్పాట్‌లోనే ప్రయాణికుల నుంచి సమాచారం సేకరించి…ఆన్‌ ది స్పాట్‌లో చర్యలు చేపట్టారు RTA అధికారులు. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న 10 ప్రైవేట్‌ వాహనాలపై కేసు నమోదు చేశారు అధికారులు.

ప్రధానంగా పర్మిట్‌ కండిషన్‌, కమర్షియల్‌ లగేజీ తీసుకెళ్లడం, అనుమతికి మించి ప్రయాణికులకు ఎక్కించుకోవడం, అధిక చార్జీలు వసూలు చే యడంపై ఆర్టీఏ అధికారులు దృష్టిపెడుతున్నారు. విజయవాడ హైవే, బెంగళూరు మార్గాల్లో గత కొద్దిరోజులుగా తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా బస్సు డ్రైవర్లకు పోలీసుల సహకారంతో డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. అధికచార్జీలు వసూలు చేస్తే రవాణాశాఖ అధికారుల దృష్టికి తేవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Telugu Academy: తెలుగు అకాడమీలో స్కామ్‌లో మరో కొత్త కోణం.. సాయికుమార్‌ ముఠాపై పోలీసుల స్పెషల్ ఫోకస్..

Saddula Bathukamma: సద్దుల బతుకమ్మకు సిద్ధమైన తెలంగాణ పల్లెలు.. కొన్నిచోట్ల ఇవాళ, మరొకొన్ని చోట్ల గురువారం..