ప్రజంట్ పండుగ సీజన్ మాత్రమే కాదు.. కరోనా సీజన్ కూడా. సరైనా జాగ్రత్తలు తీసుకోకుండా ప్రయాణాలు చేస్తే.. వైరస్ బారిన పడాల్సి ఉంటుంది. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోతే.. మీ ఊర్లకు కూడా కరోనాను తీసుకెళ్తారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ఇది రిక్వెస్ట్ కాదు.. ఆర్డర్. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా మాస్కులు పెట్టుకోకుండా బస్సు ఎక్కితే వారి దగ్గర 50రూపాయల ఫైన్ వసూలు చేయాలని అధికారులకు సూచించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కండక్టర్లు వద్ద ఉండే టికెట్ మిషన్లలో 50రూపాయల జరిమానాను అప్ డేట్ చేశారు. ఫైన్ బటన్ నొక్కగానే 50 రూపాయల జరిమానా టికెట్ వస్తుంది. మాస్క్ ధరించని వారికి టికెట్ ధరతో పాటు ఈ జరిమానాను కూడా టికెట్ రూపంలోనే ఇచ్చి షాకిస్తున్నారు కండక్టర్లు. ప్రయాణాల ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి గానూ ఈ జరిమానా నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ప్రతి ఒక్కరి క్షేమం కోసం కోవిడ్ నిబంధనలుతప్పక పాటిస్తూ ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివారం మాస్కు లేకుండా బస్సు ఎక్కిన ప్రయాణికులకు ఆర్టీసీ రూ. 50 చొప్పున ఫైన్ విధించింది. సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు బస్సులో వెళ్లాలనుకునేవారు మాస్కు విషయం మర్చిపోకండి. లేదంటే ఫైన్ తో పాటు ప్రామాదం కూడా వెంటాడుతుంది.
కాగా పండుగ రద్దీ నేపథ్యంలో అటు ఏపీఎస్ ఆర్టీసీ, ఇటు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్బులు నడుపుతున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ప్రయాణీకులు గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు.
Also Read: నల్గొండ జిల్లాలో షాకింగ్ సీన్.. గుడి ముందు పోతురాజు విగ్రహం కాళ్ల వద్ద మనిషి తల