Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల వరుస దొంగతనాలు చోటు చేసుకున్నాయి. ఓ చోట ద్విచక్ర వాహనంలో దాచిన రూ. 70 వేలను దుండుగులు కాజేయగా.. మరోచోట స్నేహం ముసుగులో కారునే కాజేశాడు ఓ వ్యక్తి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం పట్టణానికి చెందిన శ్రీనివాసులు ఎస్‌బిఐలో రూ. 70 వేలను డ్రా చేసుకుని తన స్కూటర్ డిక్కీలో దాచి పెట్టాడు. అక్కడి నుంచి కూరగాయలు కొనుగోలు చేయడానికి వెళ్లాడు. అక్కడ కూరగాయలు కొనుగోలు చేసి తిరిగి స్కూటర్ వద్దకు వచ్చి డిక్కీ ఓపెన్ చేశాడు. అందులో డబ్బులు కనిపించలేదు. దాంతో డబ్బును ఎవరో చోరీ చేశారని గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కూరగాయల మార్కెట్ పరిధిలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. మాస్క్, హెల్మెట్ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి.. స్కూటర్‌లో పెట్టిన డబ్బును దొంగిలించినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక మరో ఘటన గుంటూరు జిల్లాలోని బ్రాడీ పేటలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా టంగుటూరు శ్రీనివాసగర్‌కు చెందిన గ్రంధి హరిబాబు, ఈపూరు మండలం బోడెపూడివారిపాలేనికి చెందిన కొల్లి లక్ష్మణణరావు, బ్రాడీపేటకు చెందిన చీమకుర్తి కిరణ్ కుమార్ స్నేహితులు. వీరిలో కిరణ్ కుమార్.. సున్నం వ్యాపారం చేస్తున్నాడు. లక్ష్మణ్ రావు కార్లు అద్దెకు తిప్పుతూ బిజినెస్ చేస్తున్నాడు. అయితే, కిరణ్ కుమార్ గతేడాది ఫోర్ట్ పీకో కారును కొనుగోలు చేశాడు. అయితే, ఓ రోజు తన ఇంటి ముందు కారును పార్క్ చేయగా.. దానిని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే, కారును ఎత్తుకెళ్లింది స్నేహితులనే అని అనుమానించిన కిరణ్.. ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. నిందితులైన హరిబాబు, లక్ష్మణరావులను అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
Also read:
Road Accident: కృష్ణాజిల్లా పొలాల్లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి