Worms found in liquor bottle: లిక్కర్‌ బాటిల్‌లో పురుగులు.. తనిఖీలు నిర్వహించిన అధికారులు ఏం చెప్పారంటే..?

కర్నూలు జిల్లా నంద్యాల వై జంక్షన్ లోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ క్వాటర్ బాటిల్ లో పురుగులు రావడం పై టీవీ9 లో ప్రసారం అయిన కథనాలకు...

Worms found in liquor bottle: లిక్కర్‌ బాటిల్‌లో పురుగులు.. తనిఖీలు నిర్వహించిన అధికారులు ఏం చెప్పారంటే..?

Updated on: Jan 16, 2021 | 5:22 PM

Worms found in liquor bottle: కర్నూలు జిల్లా నంద్యాల వై జంక్షన్ లోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ క్వాటర్ బాటిల్ లో పురుగులు రావడం పై టీవీ9 లో ప్రసారం అయిన కథనాలకు ఎక్సైజ్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.  కస్టమర్‌ అందించిన వివరాల మేరకు వై జంక్షన్ షాపులో విస్తృత తనిఖీలు చేశారు. అంతే కాకుండా పురుగులు వచ్చిన బ్యాచ్ నెంబర్ ఆధారంగా అన్ని ప్రభుత్వ వైన్స్ లో తనిఖీలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఆ కంపెనీకి చెందిన మరే ఇతర బాటిళ్లలో ఎటువంటి పురుగులు లేవని నిర్ధారించారు. కస్టమర్ నుంచి పురుగులు ఉన్న క్వాటర్ లిక్కర్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. బాటిల్‌లో పురుగులు ఉండటంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

నంద్యాల పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సంక్రాంతి ‌పండుగ రోజు వై జంక్షన్ ‌లోని ప్రభుత్వ మద్యం దుకాణంలో ఓ క్వాటర్ బాటిల్ ను కొనుగోలు చేశారు. పండుగ పూట మద్యం తాగి చిల్ అవుదామనుకున్న ఆ ఇద్దరు మద్యం బాటిల్‌లో పురుగులు కనిపించడంతో కంగుతిన్నారు.

Also Read:

గాయపడ్డ తండ్రిని పరామర్శించేందుకు సొంతూరుకు జావాను.. రోడ్డు ప్రమాదంలో గాయపడి..ఆర్మీ దినోత్సవం రోజే

Covaxin and Covishield: కొవిషీల్డ్​, కొవాగ్జిన్.. శక్తిసామర్థ్యాలపై ఓ లుక్కేద్దాం పదండి.. ఎంతకాలం సేఫ్..?

Cricketer Sophie Devine: సోఫీ డెవిన్.. మ్యాచ్ మాత్రమే కాదు హృదయాలను కూడా గెలుచుకుంది.. వావ్..