Andhra Pradesh: ఎండు మిర్చికి రికార్డు ధర.. రేటు ఇంకా పెరుగుతుందా..?

|

Mar 15, 2023 | 1:06 PM

మిర్చి పంట రైతులకు లాభాలను తెచ్చి పెడుతోంది. కనీవిని ఎరుగని రీతిలో ధరలు పెరిగాయి. ఇంతకాలం రైతుల కళ్లలో నీళ్లు తెప్పించిన మిర్చి పంట.. మద్దతు ధరతో ఇప్పుడు వారిలో ఆనందాన్ని నింపుతోంది.

Andhra Pradesh: ఎండు మిర్చికి రికార్డు ధర.. రేటు ఇంకా పెరుగుతుందా..?
Red Chilli Price
Follow us on

మిర్చి ఎర్రబంగారంగా మారింది. బంగారంతో పోటీ పడుతూ దూసుకుపోతున్నాయి ఎండు మిర్చి ధరలు. మార్కెట్‌కు సరుకు కాస్త తక్కువగా వస్తూ ఉండటంతో.. డిమాండ్ అమాంతం పెరిగింది. కర్నూలు మార్కెట్‌కు ఓ రైతు తెచ్చిన మిర్చికి రికార్డు రేటు దక్కింది. క్వింటా ధర  ఏకంగా రూ.48,299 పలికింది. తెలంగాణలోని గద్వాల జిల్లా అలంపూర్‌ మండలం కోనేరు గ్రామానికి చెందిన నరసింహారెడ్డి అనే రైతు పంట మాంచి రేటుకు అమ్ముడయ్యింది. ఆయన మంగళవారం 3.62 క్వింటాళ్ల ఎండుమిర్చిని కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు తెచ్చాడు.

అది బ్యాడిగ రకం అవ్వడం.. సరుకు క్వాలిటీ కూడా సూపర్‌గా ఉండటంతో.. వ్యాపారులు మంచి ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలోనే క్వింటా రూ.48,299కు కొనుగోలు చేశారు. కర్నూలు మార్కెట్‌లో ఇప్పటి వరకు ఇదే హై రేటు అని అధికారులు తెలిపారు.  గతేడాది మిర్చి రైతును నల్ల తామర ఇబ్బంది పెట్టింది. కనీసం పెట్టుబడి పెట్టిన సొమ్ము కూడా తిరిగి రాలేదు. దీంతో అధిక దిగుబడులు, తెగుళ్లను తట్టుకునే రకాలపై రైతులు ఫోకస్ పెట్టారు. నల్ల తామర నివారణకు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దీంతో  చీడపీడల  సమస్య తగ్గింది. మంచి ధర కూడా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ధర ఇంకాస్త పెరుగుతుందేమో అని కొందరు రైతులు పంటను కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టుకుంటున్నారు. పంట తక్కువగా ఉండటంతో.. ధర మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి