RRR: రఘురామరాజు పవర్‌ కంపెనీ అవకతవకలపై ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ. ఆర్‌బీఐ ఎలా స్పందించిందంటే..

|

Oct 24, 2021 | 8:20 AM

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై ఆర్‌బీఐ స్పందించింది. రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన

RRR: రఘురామరాజు పవర్‌ కంపెనీ అవకతవకలపై ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ. ఆర్‌బీఐ ఎలా స్పందించిందంటే..
Mp Vijayasaireddy Vs Rrr
Follow us on

Vijayasai Reddy – RRR: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై ఆర్‌బీఐ స్పందించింది. రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌కు బ్యాంకు రుణాల అవకతవకలపై విచారణ జరపాలంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ఆర్‌బీఐకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై స్పందించిన ఆర్‌బీఐ.. తగిన చర్యలు తీసుకుంటామంటూ ఎంపీ విజయసాయిరెడ్డికి తెలిపింది.

మరోవైపు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు ఘటైన పదజాలంతో సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ తాగుబోతు అని, లైంగిక బలహీనతలు కలిగిన వాడంటూ విరుచుకుపడ్డారు. అలాంటి లోకేష్‌ని నాయకుడిగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నంలో భాగమే తాజాగా అల్లర్లు అని పేర్కొన్నారు. తగరపువలసలో వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో పాల్గొన్న విజయసాయి రెడ్డి.. మీడియాతో మాట్లాడారు.

టీడీపీ నేత పట్టాభి గురించి పట్టించుకోనవసరం లేదని, అతను చాలా చిన్న వ్యక్తి అని విజయసాయి పేర్కొన్నారు. కానీ, పట్టాభి బూతుల వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారని విజయసాయి ఆరోపించారు. బాడీ తగ్గించుకోమని లోకేష్‌కి ఎవరో సలహా ఇస్తే.. ఆ క్రమంలో బుర్ర తగ్గించుకున్నాడంటూ సెటైర్లు పేల్చారు. తన తండ్రి చంద్రబాబు సరైన తిండి పెట్టకపోవడంతో లోకేష్ కోపం వచ్చిందని, ఆ కారణంగానే పిచ్చి పిచ్చి ట్వీట్స్ చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు.

Read also: Sexual Harassment: మహిళా ఉద్యోగిపై తీవ్ర ఒత్తిడి.. సబ్‌ రిజిస్ట్రార్‌ జయరాజుపై లైంగిక వేధింపుల కేసు