AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నామినేషన్ల వేళ రాయచోటిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్లు, కర్రల దాడులు

అన్నమయ్య జిల్లా రాయచోటిలో నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. రాయచోటిలోని ఎస్‌ఎన్‌ కాలనీలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇరువర్గాలు ఒకరి వాహనాలకు మరొకరు నిప్పుపెట్టుకోవడంతో మంటలు చెలరేగాయి.

నామినేషన్ల వేళ రాయచోటిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్లు, కర్రల దాడులు
Rayachoti Clash
Ram Naramaneni
|

Updated on: Oct 16, 2026 | 12:37 PM

Share

అన్నమయ్య జిల్లా రాయచోటిలో నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నామినేషన్లు ప్రారంభమైన తొలి గంటలోనే ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త మధు రాయల్‌ గాయపడినట్లు తెలుస్తోంది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగినట్లు టీడీపీ వర్గాలు ఆరోపించాయి. ఈ ఘటనలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కూడా పాల్గొన్నట్లు ఆరోపణలు వినిపించాయి. రాళ్లదాడిలో మధు రాయల్‌ రక్తగాయాలతో బాధపడినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రతిదాడికి దిగినట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో పలు వాహనాలు మంటల్లో దగ్ధమైనట్లు సమాచారం. వైసీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ నిర్వహించిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us