Largest Shark Fish: తుఫాను ప్రభావంతో కాకినాడ సముద్ర తీరంలో తీవ్రంగా గాలులు వీస్తున్నాయి. సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. ఈ క్రమంలో సముద్ర అలల ఉధృతికి ఓ భారీ చేప ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అయితే అది మృతి చెంది ఉంది. ఆ చేప సుమారు 25 అడుగుల పొడవు, 3 టన్నుల బరువు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఇది తీరానికి చేరడానికి ముందే చనిపోవడంతో తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానిక జాలర్లు తెలిపారు. ఈ భారీ చేప ను చిర్మిన్ (సొర చేప) అని పిలుస్తారని, ఈ చేపలు సముద్రంలో పెరిగే నాచును, కలుషిత వ్యర్ధాలను శుద్ధిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇది తినడానికి పనికిరాదని, దీనిని ఔషధాలలో మాత్రమే వినియోగిస్తారని మత్స్యకారులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..