Raksha Bandhan 2022 Special Trains: రక్షా బంధన్ సందర్భంగా ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ఇప్పటికే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకులకు లబ్ధి చేకూరేలా మరికొన్ని మార్గాల్లో ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య రెండు సర్వీసుల ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఆగస్టు 12న సాయంత్రం 05.50 గం.లకు ప్రత్యేక రైలు (నెం.07473) సికింద్రాబాద్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.20 గం.లకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకోనుంది. అలాగే ఆగస్టు 13న సాయంత్రం 07.30 గం.లకు ప్రత్యేక రైలు (నెం.07474) తిరుపతి నుండి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 09.10 గం.లకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లోనూ జనగామ, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.
అలాగే సికింద్రాబాద్ – యస్వంత్‌పూర్ మధ్య రెండు సర్వీసుల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ద.మ.రైల్వే ప్రకటించింది. ఆగస్టు 10 తేదీన రాత్రి 09.45 గం.లకు ప్రత్యేక రైలు (07233) సికింద్రాబాద్ నుండి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 10.50 గం.లకు యస్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది. ఎదురు దిశలో ఆగస్టు 11 తేదీన మధ్యాహ్నం 03.50 గం.లకు ప్రత్యేక రైలు (నెం.07234) యస్వంత్‌పూర్ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు వేకువజామున 04.15 గం.లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్జెర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యెలహంక రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.
ఈ ప్రత్యేక రైళ్లలో జనరల్ క్లాస్, స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్‌లు ఉంటాయని ద.మ.రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
“Special trains between various destinations” @drmsecunderabad @drmhyb @VijayawadaSCR pic.twitter.com/0ORMIdyvgS
— South Central Railway (@SCRailwayIndia) August 9, 2022
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..