సొంత సామాజికవర్గం కన్నా కాపులే ఎక్కువగా ఆదరించారు : మోపిదేవి
రేపల్లెలో కాపుల నిర్వహించిన కార్తిక సమారాధనలో రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు సామాజికవర్గం తనపై చూపుతున్న ఆదరభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయంగా తాను ఈనాడు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం కాపులేనని ప్రకటించారు. తన సొంత సామాజికవర్గం కన్నా కాపులు తనను ఎక్కువ ఆదరించారని అన్నారు.
రేపల్లెలో కాపుల నిర్వహించిన కార్తిక సమారాధనలో రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు సామాజికవర్గం తనపై చూపుతున్న ఆదరభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయంగా తాను ఈనాడు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం కాపులేనని ప్రకటించారు. తన సొంత సామాజికవర్గం కన్నా కాపులు తనను ఎక్కువ ఆదరించారని అన్నారు. అందుకు కృతజ్ఞతనగా ఇకపై తాను మోపిదేవి వెంకటరమణరావుగా కాకుండా మోపిదేవి వెంకటరమణనాయుడిగా ఉంటానని వెల్లడించారు. వంగవీటి మోహనరంగా అందరికీ ఆదర్శప్రాయుడని.. త్వరలో ఆయన విగ్రహం రేపల్లెలో ఏర్పాటు చేయిస్తానని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..