AP – Telangana: ముందుంది వానల జాతర.. వచ్చే 3 రోజులు ఏపీ, తెలంగాణలో వర్షాలు

|

Jun 14, 2024 | 7:42 PM

తెలంగాణ నుండి మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ & 5.8 కి.మీ ఎత్తు వరకు ఏర్పడిన ద్రోణి ఇప్పుడు రాయలసీమ నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నది. అలానే రుతుపవనాల ప్రభావం కూడా తెలుగు రాష్ట్రాలపై గట్టిగా ఉంది.

AP - Telangana: ముందుంది వానల జాతర.. వచ్చే 3 రోజులు ఏపీ, తెలంగాణలో వర్షాలు
Weather Report
Follow us on

నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. దాంతో.. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించినట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర మీదుగా ద్రోణి కొనసాగుతోందని చెప్పింది. విశాఖలోని పలు ప్రాంతాలను కారుమబ్బులు కమ్మేశాయి. నల్లని మబ్బులతో విశాఖ నగరం పట్టపగలే చీకటిమయంగా మారింది. పార్వతీపురం మన్యం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. సాలూరులో గాలి దుమారంతో పలు చోట్ల ఇళ్లపై కప్పులు లేచిపోయాయి. సాలూరులో గాలివాన దుమారంతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దాంతో.. సాలూరులో కరెంట్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.  అల్లూరి జిల్లా అరకులోయలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు పడ్డాయి.

శ్రీకాకుళం జిల్లాలో గాలివాన బీభత్సం కొనసాగింది. ఆముదాలవలసలో వడగళ్ల వాన, టెక్కలి రోడ్డులో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. కాగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్‌లో భారీ వర్షం కురిసింది. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఓ రైతు కొట్టుకుపోవడంతో విషాదం నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…