Rain Alert in Andhra Pradesh: దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత బాగా పెరిగింది. నిత్యం రికార్డు స్థాయిలో ఎండల తీవ్రత నమోదవుతోంది. పలు రాష్ట్రాల్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఎండలు భారీగా పెరుగుతుంటే.. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగిస్తోంది. కాగా.. కొన్ని రోజులుగా ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల పంటలకు, మామిడితోటలకు నష్టం వాటిల్లుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం శనివారం ప్రకటనను విడుదల చేసింది. శనివారం, ఆదివారం, సోమవారానికి సంబంధించిన వాతవరణ రిపోర్టును వెల్లడించింది. రాష్ట్రంలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా
తక్కువ ఎత్తులో దక్షిణ / ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని పేర్కొంది.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం :
ఈ రోజు ఉరుములు , మెరుపులతో పాటు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి ఉరుములు , మెరుపులతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
ఈ రోజు, రేపు , ఎల్లుండి ఉరుములు, మెరుపులతో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read: