AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. మరో మూడు రోజులపాటు వర్షాలు: వాతావరణ శాఖ

| Edited By: Ravi Kiran

May 16, 2022 | 7:05 PM

రాబోయే 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవులకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి.

AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. మరో మూడు రోజులపాటు వర్షాలు: వాతావరణ శాఖ
Rain Alert
Follow us on

Andhra Pradesh Rain Alert కొన్నిరోజుల నుంచి ఏపీలో కురుస్తున్న వర్షాలు భారీగా నష్టాన్ని కలిగించాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవులకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఈ క్రమంలో చత్తీస్ గఢ్, విదర్భ మీదుగా బీహార్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉత్తర – దక్షిణ ద్రోణి ఈరోజు ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకు విదర్భ మధ్య కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది. తీరప్రాంతాల్లో ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1 .5కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించి ఉంది. దీని ఫలితంగా రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన..

ఉత్తర కోస్తా: ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా: ఈ రోజు, రేపు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

రాయలసీమ: ఈ రోజు రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని.. అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

Also Read:

AP BJP: బీజేపీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు గుడ్ బై.. రాజీనామా లేఖలో ఏమన్నారంటే..

Punugu Pilli: రోడ్డు ప్రమాదంలో అరుదైన పునుగు పిల్లి మృతి.. దీని ప్రత్యేకతలు మీకు తెలుసా..?