Rains: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండండి..

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని అంచనా వేసింది. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వాతావరణశాఖ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇలా ఉంది.

Rains: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండండి..
Rains Ap

Updated on: Jul 25, 2026 | 7:12 AM

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు పలు జిల్లాలకు వర్షసూచన జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు పడే సమయంలో చెట్ల కింద ఉండవద్దని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని తెలిపింది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు సురక్షితంగా ఉండాలని సూచించింది. ఈదురుగాలుల సమయంలో హోర్డింగ్స్ వద్ద ఉండొద్దని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ స్పష్టం చేసింది.

ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు

ఏపీలో నేడు, రేపు, ఎల్లుండి వర్షాలు కురవనున్నాయి. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా. వైఎస్ఆర్ కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు నిలకడగా కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెబుతున్నారు. దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం ఉండటంతో పాటు చల్లటి ఉపరితల గాలులు బలంగా వీస్తాయి. రాయలసీమ జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉంది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల స్థానికంగా ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడుతుందని పేర్కొంది.

తెలంగాణకు వర్షసూచన

ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలు అవకాశముందని తెలిపింది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో నగరాలు, పట్టణాల్లో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తెగి పడిన కరెంట్ వైర్ల వద్దకు వెళ్లవద్దని తెలిపింది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పటికే గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటివరకు సాధారణంతో పోలిస్తే లోటు వర్షపాతం భారీగా నమోదైంది. నైరుతి రుతుపవనాలు విస్తరించినా ఎల్‌నివో ప్రభావంతో వర్షాలు పడటం లేదు. ఈ ఏడాది ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ చెబుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us