అపర భగీరథుడు వైఎస్ జగన్‌.. సీఎంపై నారాయణ మూర్తి ప్రశంసలు

| Edited By:

Nov 17, 2020 | 9:53 AM

ఏలేరు, తాండవ రిజర్వాయర్లను అనుసంధానించడం ద్వారా తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు నీరు అందించి

అపర భగీరథుడు వైఎస్ జగన్‌.. సీఎంపై నారాయణ మూర్తి ప్రశంసలు
Follow us on

AP CM YS Jagan: ఏలేరు, తాండవ రిజర్వాయర్లను అనుసంధానించడం ద్వారా తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు నీరు అందించి, ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేయొచ్చని ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణ మూర్తి అన్నారు. ఈ ప్రాజెక్ట్‌కి ఆమోదం తెలిపిన సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి కృతఙ్ఞతలని ఆయన అన్నారు. రెండు జిల్లాల్లోని మెట్ట ప్రాంత రైతు సమస్యల శాశ్వత పరిష్కారానికి చొరవ చూపిన అపర భగీరథుడు జగన్ అని ప్రశంసలు కురిపించారు. (నాని-నజ్రియా మూవీకి టైటిల్‌ ఫిక్స్‌.. భలే ఇంట్రస్టింగ్‌గా ఉందే..!)

ఉత్తరాంధ్రలో 50 శాతానికిపైగా మెట్ట ప్రాంతాలు ఉన్నాయని, దీంతో ఈ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాండవ రిజర్వాయర్‌ నుంచి మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలన్న తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి.. వెంటనే తగిన కార్యాచరణ చేపట్టడం జగన్‌ చిత్తశుద్ధికి నిదర్శనమని నారాయణమూర్తి కొనియాడారు. రూ.500 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ అనుసంధాన ప్రాజెక్ట్‌తో తాండవ, ఏలేరు ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. సీఎం జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయం వలన సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందని నారాయణమూర్తి ప్రశంసించారు. (కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 952 కొత్త కేసులు.. ముగ్గురు మృతి.. కోలుకున్న 1,602 మంది