Anakapalle: చేపలు పడతాయని రైతులు వల పెట్టారు.. అందులో చిక్కింది చూసి షాక్

అనుకున్నది ఒక్కటి.. అయిందొక్కటి. అక్కడి రైతులు మంచిగా చేపలు కూర తిందామని ఆశపడితే.. ఊహించని షాక్ తగిలింది.

Anakapalle: చేపలు పడతాయని రైతులు వల పెట్టారు.. అందులో చిక్కింది చూసి షాక్
Fishing (Representative image)
Follow us

|

Updated on: Nov 23, 2022 | 4:47 PM

వారంతా రైతులు. పక్కపక్కనా పొలాలున్న వారంత జమ కూడారు. పొలాల్లోకి నీరు ప్రవహించే కాలవల్లో చేపలు రావడం గమనించారు. వాటిని అలా వదిలేసే బదులు వల పెడితే.. సాయంకాలం మాంచి చేపలు పులుసు పెట్టుకుని.. ఇంటిల్లిపాది ఎంజాయ్ చేద్దామనుకున్నారు. దొరికిన చేపల్ని సరి సమానంగా పంచుకుందామని ముందుకుగానే డిసైడయ్యారు. కానీ వారు ఒకటి అనుకుంటే.. వలకు ఇంకోటి చిక్కింది.

అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో రైతులు పెట్టిన వలకు భారీ కొండచిలువ చిక్కింది. చెరువుపల్లి సమీపంలోని పంట పొలాల్లో రైతులు.. వలను ఏర్పాటు చేశారు. నీరు ప్రవహించే పంట కాలువ వద్ద చేపలు చిక్కుతాయేమోనని.. వల పెడితే దానికి భారీ కొండచిలువ చిక్కిపోయింది. వల తీసేందుకు చూసిన రైతుకు.. భారీ కొండచిలువ కనిపించడంతో కంగుతున్నాడు. భయంతో అతనికి గుండె ఆగినంత పనైంది. దీంతో మిగిలిన రైతులకు సమాచారం అందించాడు. అయితే చివరకు కొండచిలువ మృతి చెందిందని తెలుసుకొని అంతా ఊపిరి పీల్చుకున్నారు. వలలో చిక్కుకున్న కొండచిలువను బయటకు తీశారు.

వల నుంచి బయట పడేందుకు కొండచిలువ చేసిన ప్రయత్నంలో నోటికి గాయమై రక్తశ్రావమై ప్రాణాలు కోల్పోయి ఉంటుందని అనుకుంటున్నారు. కొండచిలువ పొడవు పది అడుగుల పైనే ఉంటుంది. అంత పెద్ద కొండచిలువను ఈ ప్రాంతంలో ఎప్పుడూ చూడలేదని వారు చెబుతున్నారు.

Python

మరిన్ని ఏపీ వార్తల కోసం..