Andhra Pradesh: గుండెపోటుతో సచివాలయ ఉద్యోగి మృతి.. వివాహమైన ఏడు నెలలకే విషాదం!

|

Jan 12, 2024 | 4:01 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా కలసపాడు మండలంలోని పుల్లారెడ్డిపల్లె సచివాలయంలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగి శుక్రవారం (జనవరి 12) గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కలసపాడు మండలంలోని సింగరాయపల్లె గ్రామానికి చెందిన ఓసూరి శౌరయ్య (30) అనే వ్యక్తి పుల్లారెడ్డిపల్లెలోని సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ప్రకాశం జిల్లా లింగాపురం..

Andhra Pradesh: గుండెపోటుతో సచివాలయ ఉద్యోగి మృతి.. వివాహమైన ఏడు నెలలకే విషాదం!
Secretariat Employee Died Of Heart Attack
Follow us on

కలసపాడు, జనవరి 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా కలసపాడు మండలంలోని పుల్లారెడ్డిపల్లె సచివాలయంలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగి శుక్రవారం (జనవరి 12) గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కలసపాడు మండలంలోని సింగరాయపల్లె గ్రామానికి చెందిన ఓసూరి శౌరయ్య (30) అనే వ్యక్తి పుల్లారెడ్డిపల్లెలోని సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ప్రకాశం జిల్లా లింగాపురం గ్రామానికి చెందిన కుమారి అనే యువతితో ఏడు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే శుక్రవారం ఉదయం శౌరయ్య హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు.

వెంటనే గమనించిన శౌరయ్య కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తొలుత కలసపాడు ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి పోరుమామిళ్లలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. శౌరయ్య మృతి పట్ల ఎంపీడీవో మహబూబ్‌బీ, సచివాలయ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. వివాహం జరిగి ఏడాది కూడా కాకుండానే శౌరయ్య మృతి చెందడంతో ఆయన భార్య రోధనలు మిన్నంటాయి.

మరో ఘటన: విశాఖ రైల్వేస్టేషన్‌లో మతి స్థిమితం లేని వ్యక్తి హల్‌చల్‌..! విద్యుత్‌ తీగలు పట్టుకుంటానంటూ బెదిరింపులు

విశాఖపట్నంలోని రైల్వేస్టేషన్‌లో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. రైల్వే స్టేషన్‌ రూఫ్‌ టాప్‌ పైకి ఎక్కి విద్యుత్‌ తీగలు పట్టుకుంటానని బెదిరించసాగాడు. దీంతో ప్రయాణికులతోపాటు ఆర్పీఎఫ్‌, జీఆర్పీ పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. సాహసించి రూఫ్‌టాప్‌ పైకి ఎక్కి అతడిని ఎలాగోలా రక్షించడంతో అందరూ హమ్మయ్య అనుకున్నారు. ఆ వ్యక్తిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. తొలుత విద్యుత్‌ సరఫరా నిలిపి ఆ వ్యక్తి వద్దకు వెళ్లేందుకు పోలీసులు ప్రయతన్నించారు. అయితే అతను నాలుగో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలు పైకి దూకేశాడు. దీంతో అతడి వెంట పోలీసులు పరుగులు తీశారు. ప్రయాణికుల సాయంతో ఎట్టకేలకు అతన్ని పట్టుకుని బలవంతంగా కిందికి దించారు. అనంతరం అతన్ని ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.