AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఖద్దరును ప్రశ్నించినందుకు ఖాకీకి కోపం వచ్చింది.. అయినా తగ్గని పబ్లిక్..

లీడర్‌ను ప్రశ్నించారు జనం. దీంతో ఎస్‌ఐకు కోపం వచ్చింది. జనాన్ని గద్దించాడు. మహిళలు కాబట్టి వదిలేస్తున్నా అని వార్నింగ్ ఇచ్చాడు. అందుకు ప్రజలు కూడా సరైన కౌంటర్ ఇచ్చారు.

Andhra Pradesh: ఖద్దరును ప్రశ్నించినందుకు ఖాకీకి కోపం వచ్చింది.. అయినా తగ్గని పబ్లిక్..
Si Vs Public
Ram Naramaneni
|

Updated on: Aug 07, 2022 | 12:07 PM

Share

AP News: నువ్వేం చేస్తావ్ అంటే నువ్వేం చేస్తావ్… అంటూ సవాళ్లు ప్రతివాళ్లు విసురుకున్నారు పోలీస్ వర్సెస్ పబ్లిక్. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో జరిగిన బాహాబాహీ ఇది. కనిగిరి(Kanigiri) ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్(Burra Madhusudan Yadav) నిర్వహించిన గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమం తర్వాత జరిగిన ఘటన ఇది. జగన్ చేసిన కార్యక్రమాల్ని వివరిస్తూ… స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్లిన ఎమ్మెల్యేకి జనం నుంచి మిక్స్‌డ్ రియాక్షన్ కనిపించింది. వెలిగండ్ల మండలం పెరుగుపల్లిలో మాత్రం జనం నుంచి సీరియస్ రియాక్షన్‌ని ఫేస్ చేయాల్సివచ్చింది. సర్పంచ్‌ మంజుభార్గవిని అవమానపరిచేలా… ఆమెకు సమాచారం ఇవ్వకుండా గడపగడపకు కార్యక్రమం నిర్వహించడం ఏంటని ఎమ్మెల్యేను నిలదీశారు స్థానికులు. ఒక్కసారిగా జనం తిరగబడ్డంతో చేసేది లేక వెనుదిరిగి వెళ్లిపోయారు ఎమ్మెల్యే. తర్వాత ఎమ్మెల్యేని అడ్డుకున్న మహిళలపై వీరంగం సృష్టించారు వెలిగండ్ల ఎస్‌ఐ.

మహిళలు కాబట్టి వదిలేశాను.. లేకపోతే కథ వేరేగా ఉండేదంటూ బెదిరింపు ధోరణితో వేలు చూపిస్తూ హెచ్చరించారు ఎస్‌ఐ. దీంతో ఆగ్రహించిన మహిళలు… స్థానికులు… ఎస్‌ఐపై వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యేనే ఉద్దేశపూర్వకంగా పోలీసులను మహిళలపైకి ఉసిగొల్పాడని ఆరోపించారు స్థానికులు. మొత్తం పోలీస్ వర్సెస్ పబ్లిక్… మధ్యలో ఖద్దరు… అన్నట్టుగా సాగింది ఈ రగడ.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి