CM Jagan: ఎంపీ విజయసాయి రెడ్డికి ప్రమోషన్‌.. సీఎం జగన్‌ కీలక నిర్ణయం..

|

Apr 27, 2022 | 12:54 PM

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి(MP Vijayasai Reddy) ప్రమోషన్‌ లభించింది. ఆయన సేవలను పార్టీలో కూడా వినియోగించుకోవాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి(CM YS Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు.

CM Jagan: ఎంపీ విజయసాయి రెడ్డికి ప్రమోషన్‌.. సీఎం జగన్‌ కీలక నిర్ణయం..
Ycp Mp Vijayasai Reddy Cm J
Follow us on

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి(MP Vijayasai Reddy) ప్రమోషన్‌ లభించింది. ఆయన సేవలను పార్టీలో కూడా వినియోగించుకోవాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి(CM YS Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతలతో పాటు అదనంగా మరిన్ని పార్టీ బాధ్యతలు అప్పగించారు. రీజినల్‌ కో- ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యే, మీడియా కో-ఆర్డినేషన్‌ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కేటాయించారు. ఈ నెల 19న జారీ చేసిన ఉత్తర్వులను మార్చుతూ సీఎం కొత్త ఆదేశాలు జారీ చేశారు. గతంలో విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి బాధ్యతలు చూశారు. అయితే.. ఇటీవల కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత ఆ బాధ్యతల నుంచి విజయసాయి రెడ్డిని తప్పించారు. విశాఖ బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు.

మనం బాస్‌లం కాదు.. ప్రజా సేవకులమనే విషయాన్ని నిరంతరం దృష్టిలో ఉంచుకోవాలని అధికార యంత్రాంగానికి  స్పష్టం చేశారు సీఎం జగన్. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించేందుకే 26 జిల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రజల సమస్యల పట్ల మరింత మానవీయ దృక్పథంతో ఉండాలని, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు. కొత్త జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించిన అధికార యంత్రాగానికి తానిచ్చే సలహా ఇదేనని కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలనుద్దేశించి ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: Prashant Kishor: కాంగ్రెస్‌కు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్.. లాస్ట్ మినెట్‌లో కీలక ప్రకటన..!

Railway News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. పలు రూట్లలో రైళ్ల పునరుద్ధరణ..