నేనున్నానని.. మీకేం కాదని.. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో దొంగలు పడ్డారు.. నేనున్నానంటూ ఆదుకున్న ఓ మంచి ఎమ్మెల్యే..

|

Aug 27, 2021 | 10:53 AM

మూడు నెలల్లో కూతురి పెళ్లి.. కష్టపడిదాచుకున్న బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో దిక్కుతోచనిస్థితిలో పడిపోయింది ఆ కుటుంబం. అయితే నేనున్నానంటూ వారికి భరోసా కల్పించారు ఓ ఎమ్మెల్యే. 

నేనున్నానని.. మీకేం కాదని.. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో దొంగలు పడ్డారు.. నేనున్నానంటూ ఆదుకున్న ఓ మంచి ఎమ్మెల్యే..
Proddatur Mla Rachamallu Si
Follow us on

మూడు నెలల్లో కూతురి పెళ్లి.. కష్టపడిదాచుకున్న బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో దిక్కుతోచనిస్థితిలో పడిపోయింది ఆ కుటుంబం. అయితే నేనున్నానంటూ వారికి భరోసా కల్పించారు ఓ ఎమ్మెల్యే. క‌ష్టపడి పోగుచేసుకున్న బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. మ‌రో మూడు నెలల్లో పెళ్ళి జరగాల్సి ఉంది. అయితే ఇంతలోనే వారి ఇంట్లో చోరీ జరిగింది. దీంతో ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం. అయితే క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్న ఆ కుటుంబాన్ని ఓదార్చారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమ‌ల్లు శివ‌ప్రసాద్ రెడ్డి.

అంతేకాదు ఆ ఇంట్లో జరగాల్సిన పెళ్ళికి ఎలాంటి అవ‌రోధాలు లేకుండా త‌న వంతు సాయంగా 5 తులాల బంగారాన్ని ఇస్తాన‌ని హామీ ఇచ్చాడు. దీంతో ఆ కుటుంబం ఎమ్మెల్యేకు కృత‌జ్ఞత‌లు తెలిపింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్థానిక వైఎంఆర్ కాల‌నీలో అంగ‌న్వాడీ కార్యక‌ర్త రాజేశ్వరి ఇంట్లో ప‌ట్టప‌గ‌లే దొంగ‌లు ప‌డ్డారు. కూతురు పెళ్లి కోసం బీరువాలో దాచి ఉంచిన 10 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.

భ‌ర్త విదేశాల‌కు వెళ్లి క‌ష్టపడి ప‌నిచేయడంతో వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటోంది రాజేశ్వరి . అయితే ఇలాంటి సమయంలో ఇంటిలో దొంగ‌లు ప‌డి దోచుకుపోవ‌డంతో క‌న్నీరు మున్నీరుగా విల‌పించింది. మ‌రో మూడు నెల‌ల్లో తన కుమార్తె పెళ్లి ఉంది. అయితే మ‌గ‌ పెళ్లి వారికి ఇస్తామ‌న్న ప‌ది తులాల‌ బంగారు దొంగలు ఎత్తుకెళ్లడంతో దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయారు కుటుంబ సభ్యులు.

స్థానిక 4వ వార్డు కౌన్సిల‌ర్ వ‌రికూటి ఓబుళ‌రెడ్డి, దూదేకుల సంఘం నాయకులు ప‌డిగాల ద‌స్తగిరి ద్వారా స‌మాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు స్వయంగా రాజేశ్వరి ఇంటికి వెళ్లి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. అంతేకాదు పెళ్ళి ఆగిపోకుండా చోరీ అయిన సొమ్ము దొరికేదాకా ఎదురు చూడ‌కుండా వారికి తాను అండ‌గా ఉన్నాన‌ని భ‌రోసా ఇచ్చారు.

రాజేశ్వరి కూతురు హారిక వివాహం కోసం ఐదు తులాల బంగారు న‌గ‌లు చేయిస్తాన‌ని ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్రసాద్‌రెడ్డి హామీ ఇచ్చి వారికి ధైర్యం చెప్పారు. అంతేకాదు చోరీ అయిన సొత్తును త్వర‌గా ప‌ట్టుకుని వీరికి అప్పగించాల‌ని త్రీ టౌన్ సిఐ ఆనంద‌రావును ఆదేశించారు ఎమ్మెల్యే.

ఇవి కూడా చదవండి: E-Shram Card: అసంఘటిత రంగం కార్మికులకు ఓ వ్యవస్థ ఈ-శ్రామ్ కార్డ్.. ఇది ఎలా ఫిల్ చేయాలి.. స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలుసుకోండి

Havana Syndrome‌: అఫ్గానిస్తానీయుల తరలింపులో అంతు చిక్కని సమస్య.. అదృశ్య శక్తులు దాడి చేస్తున్నాయంటున్న అమెరికా అధికారులు..