PM Modi Sankranti Greetings: తెలుగు రాష్ట్రాల ప్రజలకు భోగభాగ్యాలు కలగాలంటూ ప్రధాని మోడీ శుభాకాంక్షలు

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్ర ప్రజలకు తన సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ముందుగా ఇంగ్లిష్ లో విషెష్ చెప్పిన ప్రధాని.. అనంతరం తెలుగులో ట్వీట్ చేశారు. తెలుగు ప్రజలందరికీ అందరికీ భోగి శుభాకాంక్షలు...

PM Modi Sankranti Greetings:  తెలుగు రాష్ట్రాల ప్రజలకు భోగభాగ్యాలు కలగాలంటూ ప్రధాని మోడీ శుభాకాంక్షలు

Updated on: Jan 13, 2021 | 12:59 PM

PM Modi Sankranti Greetings: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్ర ప్రజలకు తన సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ముందుగా ఇంగ్లిష్ లో విషెష్ చెప్పిన ప్రధాని.. అనంతరం తెలుగులో ట్వీట్ చేశారు. తెలుగు ప్రజలందరికీ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు ప్రధాని.

హిందువులు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలను తమతమ సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండుగ అని అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది తెలుగు లోగిళ్ళు. అవును భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలుగా తెలుగు రాష్ట్ర ప్రజలు మూడురోజుల పాటు.. తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ పండుగ శోభ మొదలైంది. పట్టణ ప్రజలు పల్లెల బాట పట్టారు. పల్లెల్లో పండుగ సందడి ఓ రేంజ్ లో కొనసాగవుతుంది.

Also Read: వ్యవ‘సాయానికి‘ కృతఙ్ఞతగా కనుమ పండుగ.. ఆ పర్వదినాన ప్రయాణం కూడదు.. కారణమేంటో తెలుసా?