PM Modi: ప్రజాగళం సభలో ఆసక్తికరమైన ఘటన.. మీకేదైనా అయితే తట్టుకోలేం.. బారిగేట్లను దిగాలని కోరిన మోడీ

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత ఏపీలో రాజకీయాలు మరింత ఊపందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఏపిలో పర్యటిస్తున్నారు. చిలుకలూరిపేటలో నిర్వహించి ప్రజాగళం సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సభలో వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తోపాటు..

PM Modi: ప్రజాగళం సభలో ఆసక్తికరమైన ఘటన.. మీకేదైనా అయితే తట్టుకోలేం.. బారిగేట్లను దిగాలని కోరిన మోడీ
Pmmodi

Updated on: Mar 17, 2024 | 6:03 PM

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత ఏపీలో రాజకీయాలు మరింత ఊపందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఏపిలో పర్యటిస్తున్నారు. చిలుకలూరిపేటలో నిర్వహించి ప్రజాగళం సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సభలో వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తోపాటు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీ సభ ప్రాంగణానికి చేరుకుని వేదికపై ఆసీనులయ్యారు. సభ ప్రాంగాణం జనసంద్రంలా మారింది. ఇదిలా ఉండగా, ప్రజాగళం సభలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నసమయంలో అభిమానులు బారికేడ్లపైకి ఎక్కారు. గమనించిన ప్రధాని మోడీ వారిని వెంటనే దిందగకు దిగాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. విద్యుత్ తీగలవల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని, దీనిని అర్థం చేసుకోవాలని కార్యకర్తలను కోరారు. మీకేదైనా అయితే తట్టుకోలేమని మోడీ కోరడంతో వెంటనే కార్యకర్తలు బారికేడ్లపై నుంచి కిందకు దిగారు.