అడకత్తెరలో గేమ్ ఛేంజర్లు.. శుద్దపూసలెవరు..? కనిపించని నాలుగో సింహాలెవరు?

బహిరంగ హెచ్చరికలు.. దాంతోపాటే ఓదార్పులు. నిజానికి.. అధికారులు, రాజకీయ నేతల మధ్య కోల్డ్‌ వార్‌ ఇప్పుడు మొదలైంది కాదు. నాలుగంకెల జీతంరాళ్లకు పనిచేసే హోమ్‌గార్డ్‌, క్లర్క్‌ నుంచి రాష్ట్ర పాలన, పోలీసు యంత్రాంగం మొత్తాన్ని చూపులువేలితో శాసించగల చీఫ్ సెక్రటరీ, డీజీపీ దాకా.. అందరిదీ ఒకటే కథ. అంతులేని పని ఒత్తిడి.

అడకత్తెరలో గేమ్ ఛేంజర్లు.. శుద్దపూసలెవరు..? కనిపించని నాలుగో సింహాలెవరు?
Game Changer

Updated on: Feb 19, 2025 | 10:13 PM

గివ్ రెస్పెక్ట్.. టేక్ రెస్పెక్ట్..! గౌరవ మర్యాదలు అనేవి అడుక్కుంటే వచ్చేవి కావు. ఆజమాయిషీ చేస్తే దొరికేవి కావు. ఇచ్చిపుచ్చుకుంటే వచ్చేవి. పొలిటీషియన్ అండ్ బ్యూరోక్రాట్.. వీళ్ల ప్రొఫెషనల్ రిలేషన్ కూడా అచ్చంగా అట్టాంటిదే. ఇద్దరూ పబ్లిక్ సర్వెంట్లే కనుక వీళ్ల సంబంధం మ్యూచ్యువల్ అండర్‌స్టాండింగ్‌ మీదే డిపెండై ఉంటుంది. రైలు పట్టాల్లా బ్యాలెన్స్‌డ్‌గా ముందుకెళితేనే గవర్నమెంట్లు సజావుగా నడిచేది. కానీ.. అదిప్పుడు జరుగుతోందా? లెజిస్లేటివ్ సిస్టమ్‌కీ కార్యనిర్వాహక వ్యవస్థకూ మధ్య ఏర్పడ్డ ఈ గ్యాప్‌ అంతకంతకూ పెరుగుతోందా..? అన్న చర్చ మొదలైంది. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా సగటు పొలిటీషియన్ పదవికుండే ఆయుష్షు మహా అయితే ఐదేళ్లు. ఆ తర్వాత ప్రజామోదం దొరికి అదృష్టాలు వరిస్తేనే వాళ్లకు ఎక్స్‌టెన్షన్లు. లేదంటే అట్నుంచటు రిటైర్మెంట్లే దిక్కు. కానీ.. సరాసరి బ్యూరోక్రాట్ మాత్రం సర్వీస్‌లో ఉన్నంత వరకూ జనంతోనే ఉంటాడు. జనంలోనే ఉంటాడు. ఆ తేడా ఎప్పటికి తెలియాలి.. ఎవ్వరికి తెలియాలి..? మనం చెప్పినా చెప్పకపోయినా.. ఆ మూడు సింహాలకు మాత్రమే సెల్యూట్ కొట్టాలని వాళ్లకూ ఉంటుంది. తొలిసారి ఖాకీ టోపీ పెట్టుకున్నప్పుడు వాళ్లు చేసిన ప్రమాణం కూడా అదే. కష్టపడి చదివి.. సివిల్స్‌లో ర్యాంకు కొట్టి.. మస్సూరి లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో రెండేళ్ల పాటు కఠోర శిక్షణ తీసుకుని.. నడత, నడవడిక, పాలనా విషయాల్లో భేష్ అనిపించుకుని, దేశంలోని క్లిష్ట పరిస్థితుల్ని అవగతం చేసుకుని.. సబ్‌కలెక్టర్‌గా చార్జ్...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి